Posts

ఆడదానికి హిందు మతం మీద నమ్మకం ఉంటే తన భర్త చనిపోయాడని మేట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో రాసి చూసుకోవచ్చు

 రమా సుందరి అనే రచయిత్రి ఉన్నారు. ఆవిడ నాస్తికురాలు కావడం వల్ల బొట్టు పెట్టుకోదు. గుంటూరులోని ఒక అపార్ట్‌మెంట్‌వాళ్ళు ఆవిడని ముస్లిం అనో, విధవ అనో అనుకుని ఇల్లు అద్దెకి ఇవ్వడం కుదరదు అనేసారు. ఈ రోజుల్లో కుల వివక్ష, లింగ వివక్ష లేదు అనే ప్రోపగాండాని కొంత మంది స్త్రీలు కూడా నమ్ముతున్నారు. అలా నమ్మే స్త్రీ పెళ్ళి కానిది అయితే తన భర్త చనిపోయాడని మేట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో రాసి చూసుకోవచ్చు, పెళ్ళైనది అయితే బొట్టు తీసేసి అద్దె ఇంటి కోసం వెతకొచ్చు. ఆ రెండిటిలో ఏది చేసినా ఎంత మంది ఆమె మీద మొహం చాటేస్తారో తెలిసి వస్తుంది. విశాఖపట్నంలో ఒకడు తాను ఎన్.ఆర్.ఐ.నని చెప్పుకుని మేట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ పెట్టాడు. భర్త చనిపోయిన స్త్రీలు & విడాకులు తీసుకున్న స్త్రీల చేత తన బ్యాంక్ అకౌంట్‌లో పైసలు డిపాజిట్ చెయ్యించుకుని పారిపోయాడు. అతని మీద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేస్ రెజిస్టర్ అయ్యింది. భర్త చనిపోయిన స్త్రీ రెండవ పెళ్ళి చేసుకోవాలనుకుంటే తనకి తెలిసిన వ్యక్తినే కాంటాక్ట్ చెయ్యొచ్చు. బ్లాగులు & ఫేస్‌బుక్‌లో స్త్రీవాదం కబుర్లు చెప్పేవాడు కూడా భర్త చనిపోయిన స్త్రీని పెళ్ళి చేసుకోడ...

హిజ్రా వృత్తి గురించి నేను షేర్ చేసిన లింక్‌ని డిలీట్ చేసిన ఫేస్‌బుక్

హిజ్రా వృత్తిని హిజ్రాలు వదులుకుంటే హిజ్రా అనే పదం వాడాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. హిజ్రా అనే పదాన్ని నిషేధించడం వల్ల ఆ వృత్తి పోదు. ఈ నిజం రాసినందుకు ఫేస్‌బుక్ నేను షేర్ చేసిన లింకులని డిలీట్ చేసింది. ఉత్తర భారత దేశంలో వాల్మీకీ కులస్తులు పాకీ వృత్తి నుంచి బయటకి రావాలనుకుంటున్నారు. వాళ్ళు ఆ వృత్తిని వదిలేస్తే అగ్రకులాలవాళ్ళు తమ లెట్రిన్లు తామే కడుక్కోవాల్సి వస్తుందని వాళ్ళు ఆ వృత్తిని వదలకుండా అగ్రకులాలవాళ్ళు అడ్డు తగులుతున్నారు. మనవాళ్ళకి సమాజం మారడం ఇష్టం లేదు కానీ పదాలని నిషేధించడం మీద ఎక్కడా లేని ఆసక్తి ఉంది. కోర్టు పాకీ అనే పదాన్ని నిషేధిస్తుంది, సఫాయీ కర్మచారీ అనే పదాన్ని వాడాలంటుంది, కానీ పాకీ వృత్తి నుంచి బయటకి రావాలనుకునేవాళ్ళని మనవాళ్ళు బయటకి రానివ్వరు.

సుప్రీం కోర్ట్ హిజ్రా అనే పదాన్ని కూడా నిషేధిస్తుందా?

Image
   నేను రాయగడ సబ్ జెయిల్‌లో ఉన్నప్పుడు నాకు అక్కడ పాపు అనే దొంగ పరిచయమయ్యాడు. అతను రాయగడ సబ్ జెయిల్‌తో పాటు కోరాపుట్ సెంట్రల్ జెయిల్, పాట్నా జెయిల్‌లలో కూడా గడిపాడు. ఒకసారి రైల్వే పోలీసులు ట్రెయిన్లలో పాసింజర్లని హెరాస్ చేస్తున్న హిజ్రాలని రాయగడ సబ్ జెయిల్‌కి తీసుకొచ్చారని చెప్పాడు. ఆ హిజ్రాలు ఎలా బిహేవ్ చేసేవాళ్ళో కూడా చెప్పాడు. జెయిల్‌లో కైదీలు కేంటీన్‌లో సబ్బులు, సిగరెట్లు కొనుక్కోవడానికి కొంత డబ్బు ఉంచుకుంటారు. ఆ పైసలు కోసం హిజ్రాలు కైదీలని హెరాస్ చేసేవాళ్ళు. హిజ్రాలు కైదీలని తమతో పడుకోమని బలవంతం కూడా చేసేవాళ్ళు. వాళ్ళతో పడుకుంటే ఎయిడ్స్ వస్తుందనే భయం వల్ల కైదీలు వాళ్ళతో పడుకునేవాళ్ళు కాదు, జెయిలర్స్‌కి కంప్లెయింట్ ఇచ్చేవాళ్ళు. ఆ జెయిల్‌లో ఒక సెల్‌కి పాతిక నుంచి యాభై మంది కైదీలు ఉంటారు, పెద్దపెద్ద దొంగల్ని నలుగురైదుగురు ఉండే సెల్స్‌లో పెడతారు లేదా ఒంటరి సెల్స్‌లో పెడతారు. సిగ్గు విడిచి పాతిక మంది చూస్తుండగా హిజ్రాతో పడుకుంటే ఏ ఎయిడ్స్ వస్తుందో, సిఫిలిస్ వస్తుందో, గనేరియా వస్తుందో అనే భయం కైదీలకి ఉండేది. హిజ్రాలు జైలులో నీళ్ళ కుండీల దగ్గర టవల్ కట్టుకోకుండా నగ్నంగా స్నానం చే...

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

Image
 సినిమాల్లో విలన్ కొడుకు ఏక్సిడెంట్ చేస్తాడు, విలన్ కార్ డ్రైవర్‌ని సరెండర్ చెయ్యిస్తాడు. నిజజీవితంలో పోలీసులు సరెండర్‌ని అంత సులభంగా నమ్మరు. మా ఊరి బస్ ఓనర్ లైసెన్స్ లేని డ్రైవర్ చేత బస్ నడిపించాడు. అది ఏక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు. డ్రైవర్‌కి లైసెన్స్ లేదనే విషయం బయటపడకూడదని ఓనర్ తన సొంత డ్రైవింగ్ లైసెన్స్ చూపించి సరెండర్ అయ్యాడు. పోలీసులు ఓనర్ మీదే కేస్ రాసారు. ఇప్పుడు ఓనర్ కోర్ట్ చుట్టూ తిరుగుతున్నాడు. నక్సల్ సరెండర్స్‌ని కూడా పోలీసులు అంత సులభంగా నమ్మరు. 2011లో సరెండర్ అయిన దున్న కేశవరావుకి ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన దున్న కేశవరావు ఒడిశాలో పని చేసాడు. అతను తమకి చెప్పకుండా లొంగిపోయాడని ఒడిశా పోలీసులు ఆంధ్ర పోలీసులకి చెప్పడంతో ఆంధ్ర పోలీసులు అతన్ని ఒడిశా అధికారులకి అప్పగించారు. ఒడిశా అధికారులు అతనికి భుబనేశ్వర్ జైలులో నరకం చూపించారు. కేశవరావు ఒడిశా పోలీసులకి చెప్పే లొంగిపోయాడు. అతను డి.జి.పి. ముందు లొంగిపోవడం వల్ల అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. రెండు రాష్ట్రాలలో అతనితో కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు అడ్రెస్‌లు మార్చేసారు. వాళ్ళ అడ్రెస్‌లు చెప్పలేకపోవడం...

శంకర్ దాదాలు IAS, IPS అధికారులైతే ఏమవుతుంది?

Image
 గన్ లైసెన్స్ అప్లికేషన్‌ని హెల్దీ కండిషన్‌లో డీల్ చెయ్యడం చేతకాని SPకి DIG ప్రమోషన్ వచ్చింది ఆ అధికారి పేరు డాక్టర్ చిత్తూరి మాచిరాజు త్రివిక్రమ వర్మ. ఆయన చదివింది MBBS కానీ ఆయన శంకర్ దాదా కంటే తెలివైనవాడు కాదు. చాలా సిసి కెమెరాలకి ఆడియో రెకార్డింగ్ సౌకర్యం ఉండదు. ఆఫీస్ సెక్యూరిటీ ఉద్యోగులు సిసి కెమెరాల ముందు కూడా లంచం అడగగలరు. లంచం డైరెక్ట్‌గా అడగకుండా ప్రాక్టికల్ జోకులు కూడా వెయ్యగలరు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయపు సెక్యూరిటీ ఉద్యోగులు నా మీద అలాంటి ప్రాక్టికల్ జోకులే వేసారని నేను త్రివిక్రమ వర్మ గారికి లెటర్లు రాసినా, వాట్సాప్‌లో చెప్పినా అర్థం కాలేదు. నేను 2017 జనవరి 18న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లో గన్ లైసెన్స్ కోసం అప్లై చేసాను. అప్పట్లో పొట్నూరు రజనీకాంతరావు గారు జాయింట్ కలెక్టర్. ఆయన శస్త్ర నియమావళి 2016 చదవలేదు. ఆర్మ్‌స్ రూల్స్ 2016 ప్రకారం జిల్లా కలెక్టర్ స్టేట్ వేలిడ్ గన్ లైసెన్స్ ఇవ్వగలడు. ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ఏరియా వేలిడిటీ రాష్ట్ర హోమ్ సెక్రేటరీ మాత్రమే ఇవ్వగలడు. నా ఆస్తి ఒడిశాలో ఉందని తెలిస్తే నన్ను హోమ్ సెక్రేటరీ ఆఫీస్‌కి వెళ్ళమని కలెక్టర్ వెంటనే చెప్ప...

కుల సమస్య పరిష్కరించకుండా కామన్ సివిల్ కోడ్ ఎలా అమలు చేస్తారు?

 కామన్ సివిల్ కోడ్ వస్తే హిందువుల్లో ఉన్న కుల వ్యవస్థని ముస్లింలకి & క్రైస్తవులకి వర్తింపచేస్తారా లేదా హిందువుల్లో కులాలు లేవు అని చెప్పి రిజర్వేషన్‌ని ఎత్తి వేస్తారా? https://kadhalu.wordpress.com/2016/10/05/%e0%b0%89%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8c%e0%b0%b0-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b1%83%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ad/  నేను ఈ మధ్యనే కాకినాడ జిల్లా పెదబ్రహ్మదేవం గ్రామంలో ఒక కులాంతర వివాహానికి సాక్షి సంతకం పెట్టడానికి వెళ్ళాను. అది అమ్మాయి తల్లితండ్రులకి ఇష్టం లేని పెళ్ళి. ఆ అమ్మాయి వీధిలో ఉన్నవాళ్ళు తమ కులం పేరు చెప్పలేదు కానీ మా కులం పేరు అడిగారు. "మీది ఏ కులానికి ఎక్కువ, ఏ కులానికి తక్కువ" అని కూడా అడిగారు. మాది సొంత వ్యవసాయ భూమి ఉన్న కులం అని చెప్పాను. ఆ అమ్మాయి తల్లితండ్రులు భూమి లేని కూలీలు కానీ మాది ఏ కులానికి ఎక్కువో, ఏ కులానికి తక్కువో అడిగారు. ఈ రోజుల్లో కులాలు లేవు అనే ప్రోపగాండాని చిన్నప్పటి నుంచి వింటున్నాను. పల్లెటూర్లలో కులం పేరు బహిరంగంగా అడిగేవాళ్ళని ఇప్పుడు కూడా చూస్తున్నాను...

చాటని, జల్లెడని హిందీలో ఏమంటారో తెలుగు రాష్ట్రాల బిజెపి నేతలని అడిగితే చాట-బుచికి కామెడీ అవుతుంది

Image
  నేను సినిమాలు చూసి హిందీ నేర్చుకున్నాను. నా హిందీ మాటలు నేటివ్ హిందీ స్పీకర్‌విలాగే ఉంటాయి. బిజెపివాళ్ళు హిందీ సినిమాలని గానీ సాహిత్యాన్ని గానీ ప్రోత్సహించడం లేదు. వాళ్ళు హిందీ రానివాళ్ళు భారతీయులు కాదు అంటున్నారు. ఆ పార్టీలో ఉన్న దక్షిణ భారతీయ నాయకుల్లో ఎంత మందికి హిందీ వచ్చో నరేంద్ర మోదీని అడిగితే వాళ్ళ చొక్కాలకి ఉన్న రంధ్రాలే బయటపడతాయి. ఛలనీకో కిత్నే కానో హోతే హే, నరేంద్ర మోదీ కీ కమీజ్ కో భీ ఉత్నే కానో హై. జల్లెడకి ఎన్ని చిల్లులో మన తెలుగు రాష్ట్రాల బిజెపి లీడర్లని అడిగినా నాలుక కరుచుకుంటారు.  నేను ఇన్ని హిందీ సినిమాలు చూసాను కానీ జీలుగు చెట్టుని హిందీలో ఏమంటారో నాకు ఇప్పుడు కూడా తెలియదు. అల్లంని హిందీలో అద్రక్ అంటారు కానీ రైల్వే స్టేషన్‌లో టీ అమ్ముకునే తెలుగువాళ్ళు హిందీ ప్రయాణికుల ముందు అల్లం చాయ్ అని అరవడం, వీళ్ళ అరుపు ఆ ప్రయాణికులకి అర్థం కాకపోవడం చూసాను.