హిజ్రా వృత్తి గురించి నేను షేర్ చేసిన లింక్‌ని డిలీట్ చేసిన ఫేస్‌బుక్

హిజ్రా వృత్తిని హిజ్రాలు వదులుకుంటే హిజ్రా అనే పదం వాడాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. హిజ్రా అనే పదాన్ని నిషేధించడం వల్ల ఆ వృత్తి పోదు. ఈ నిజం రాసినందుకు ఫేస్‌బుక్ నేను షేర్ చేసిన లింకులని డిలీట్ చేసింది. ఉత్తర భారత దేశంలో వాల్మీకీ కులస్తులు పాకీ వృత్తి నుంచి బయటకి రావాలనుకుంటున్నారు. వాళ్ళు ఆ వృత్తిని వదిలేస్తే అగ్రకులాలవాళ్ళు తమ లెట్రిన్లు తామే కడుక్కోవాల్సి వస్తుందని వాళ్ళు ఆ వృత్తిని వదలకుండా అగ్రకులాలవాళ్ళు అడ్డు తగులుతున్నారు. మనవాళ్ళకి సమాజం మారడం ఇష్టం లేదు కానీ పదాలని నిషేధించడం మీద ఎక్కడా లేని ఆసక్తి ఉంది. కోర్టు పాకీ అనే పదాన్ని నిషేధిస్తుంది, సఫాయీ కర్మచారీ అనే పదాన్ని వాడాలంటుంది, కానీ పాకీ వృత్తి నుంచి బయటకి రావాలనుకునేవాళ్ళని మనవాళ్ళు బయటకి రానివ్వరు.

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట