కుల సమస్య పరిష్కరించకుండా కామన్ సివిల్ కోడ్ ఎలా అమలు చేస్తారు?

 కామన్ సివిల్ కోడ్ వస్తే హిందువుల్లో ఉన్న కుల వ్యవస్థని ముస్లింలకి & క్రైస్తవులకి వర్తింపచేస్తారా లేదా హిందువుల్లో కులాలు లేవు అని చెప్పి రిజర్వేషన్‌ని ఎత్తి వేస్తారా?

https://kadhalu.wordpress.com/2016/10/05/%e0%b0%89%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8c%e0%b0%b0-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b1%83%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ad/

 నేను ఈ మధ్యనే కాకినాడ జిల్లా పెదబ్రహ్మదేవం గ్రామంలో ఒక కులాంతర వివాహానికి సాక్షి సంతకం పెట్టడానికి వెళ్ళాను. అది అమ్మాయి తల్లితండ్రులకి ఇష్టం లేని పెళ్ళి. ఆ అమ్మాయి వీధిలో ఉన్నవాళ్ళు తమ కులం పేరు చెప్పలేదు కానీ మా కులం పేరు అడిగారు. "మీది ఏ కులానికి ఎక్కువ, ఏ కులానికి తక్కువ" అని కూడా అడిగారు. మాది సొంత వ్యవసాయ భూమి ఉన్న కులం అని చెప్పాను. ఆ అమ్మాయి తల్లితండ్రులు భూమి లేని కూలీలు కానీ మాది ఏ కులానికి ఎక్కువో, ఏ కులానికి తక్కువో అడిగారు. ఈ రోజుల్లో కులాలు లేవు అనే ప్రోపగాండాని చిన్నప్పటి నుంచి వింటున్నాను. పల్లెటూర్లలో కులం పేరు బహిరంగంగా అడిగేవాళ్ళని ఇప్పుడు కూడా చూస్తున్నాను. కామన్ సివిల్ కోడ్ వస్తే కులాంతర వివాహాలని అనుమతిస్తారా లేదా నిషేధిస్తారా?

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట