ప్రోపగాండా భాష మాట్లాడితే మిమ్మల్ని తింగరోళ్ళు అనుకుంటారు

జైలులో కైదీని లోపల పెట్టే ముందు జైలు సూపరింటెండెంట్ కైదీకి కులం పేరు అడుగుతాడు. అతను "ఈ రోజుల్లో కులాలు లేవు" అనో, "నేను నాస్తికుణ్ణి కనుక నాకు కులం వర్తించదు" అనో చెపితే అతన్ని తింగరోడు అనుకుంటారు. పెళ్ళి సంబంధం కోసం వెళ్ళినప్పుడు "మీది ఏ కులం?" అని అడుగుతారు తప్ప "మీది ఏ సామాజిక వర్గం?" అని అడగరు. "మాది ఫలానా సామాజిక వర్గం" అని చెప్పుకున్నా విచిత్రంగా చూస్తారు. ప్రోపగాండా భాష మాట్లాడితే ఇలాగే నవ్వులపాలు అవుతాము. నేను జైలులో ఉన్నప్పుడు నేను ఉండిన సెల్‌లో ఒక కోమటోడు, ఒక బాపనోడు ఉండేవారు. ఆ సెల్‌లో ఎక్కువ మంది పేదవాళ్ళు. ఆ బాపనోడు ఆస్తి ఎక్కువ ఉన్నవాడే. అతను పాక్సో కేసులో జైలుకి వచ్చాడు. జైలులో డబ్బున్నవాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి అతను పంచముల పక్కనే పడుకున్నాడు, వాళ్ళ పక్కనే కూర్చుని తిన్నాడు. జైలు నుంచి విడుదల అయిన తరువాత అతను తన కులంవాళ్ళ ఇంటిలోనే తింటాడు తప్ప పంచముల పక్కన కూర్చుని తినడు.


ఇండియాలోని జైళ్ళలో దళితులు & ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది. వీళ్ళు లాయర్ ఫీజ్ కట్టలేకపోవడం వల్ల వీళ్ళకి బెయిల్ రావడం లేదు. ఈ విషయం జైళ్ళ శాఖ అధికారులే చెపుతున్నారు. పోలీసులు లంచం కోసం పెట్టే తప్పుడు కేసుల్లో ఎక్కువగా పేదవాళ్ళే ఇరుక్కుంటారు. పేదవాళ్ళకి లీగల్ సర్వీస్ దొరకడం కష్టం అని జైల్ సూపరింటెండెంట్‌కి తెలిసినా కోర్ట్ నుంచి రిలీజ్ ఆర్డర్ లేకుండా వాళ్ళని వదిలిపెట్టలేడు. రిలీజ్ ఆర్డర్ మీద ఉన్న సంతకం న్యాయమూర్తిదో, కాదో చెక్ చెయ్యాల్సి కూడా ఉంటుంది. హిందు మతం నుంచి ఇస్లాంలోకి మారినవాళ్ళలో ఎక్కువ మంది వెనుకబడిన కులాలవాళ్ళు. ఒకప్పుడు బ్రాహ్మణులు & రాజ్‌పుత్‌లు కూడా ముస్లిం రాజుల దగ్గర ఉద్యోగాల కోసం ఇస్లాంలోకి మారేవాళ్ళు కానీ ఇప్పుడు హిందు మతాన్ని వదులుకునేవాళ్ళలో పేదవాళ్ళే ఎక్కువ ఉంటారు. మన దేశంలో కులం, మతం, ఆర్థిక అసమానతలు కలిసే ఉన్నాయి. ఈ రోజుల్లో కులాలు లేవు అని బుకాయించడం వల్ల కులం పోదు. జైల్ సూపరింటెండెంట్ నాకు కులం పేరు అడిగినప్పుడు నేను కులం పేరు కరెక్ట్‌గానే చెప్పాను. నేను నాస్తికుణ్ణే కానీ నా కుటుంబ సభ్యులు హిందువులు. ప్రభుత్వం నన్ను కుటుంబ సభ్యుల కులం ఆధారంగా ఐడెంటిఫై చేస్తుంది. "నేను నాస్తికుణ్ణి కనుక నాకు కులం వర్తించదు" లాంటి వాదనలు ప్రభుత్వ అధికారి ముందు చెల్లవు కాబట్టి అలాంటి వాదన నేను చెయ్యలేదు.

ఈనాడు, స్వాతి పత్రికలు "ఈ రోజుల్లో లింగ వివక్ష లేదు" అనే ప్రచారం కూడా చేసాయి. ఆ ప్రచారాన్ని నమ్మి ఒక స్త్రీ పెళ్ళికి ముందు డేటింగ్ చేసి కడుపు తెచ్చుకుంటే ఆమెని ఎవడైనా పెళ్ళి చేసుకుంటాడా? ఫలానా విశ్వదుందరి పదకొండు మందితో డేటింగ్ చేసింది అని పబ్లిసిటీ ఇస్తున్న వెబ్‌సైట్‌లని ఉద్దేశించే ఇది అడుగుతున్నాను.

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట