Posts

Showing posts from October, 2023

కుల నిర్మూలనకి మార్గం అది కాదు

 కులం పోవాలంటే హిందు మతం పూర్తిగా పోవాలి. బాపనోళ్ళు రాసిన పురాణాల్లోని విలన్లని హీరోలుగా ఊహించుకోవడం వల్ల కులం పోదు. పురాణాలు అన్నీ కల్పితాలు. రాముడు పుట్టాడని బాపనోడు నిరూపించలేడు. రావణుడు పుట్టాడని దళితుడు నిరూపించలేడు. నిరూపించగలిగే దాన్ని ఎవరూ పురాణం అనరు. నిరూపణతో సంబంధం లేకుండా నమ్మే దాన్నే పురాణం అంటారు. దసరా నాడు రావణ దహనం చేసేవాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ ఎంత తక్కువ ఉంటుందో, రావణ దహనాన్ని అడ్డుకుంటామనేవాళ్ళకి కూడా సైంటిఫిక్ టెంపర్ అంతే తక్కువ ఉంటుంది, రామ దహనం చేసేవాళ్ళ సైంటిఫిక్ టెంపర్ కూడా అంతే తక్కువ ఉంటుంది. ఎం.ఆర్.పి.ఎస్.వాళ్ళు రావణ దహనం మీద కోర్టులో కేస్ వేస్తామంటున్నారు. రాముడు, రావణుడు పుట్టారని ఎవరూ నిరూపించలేరు. నిరూపించలేని వాటి ఆధారంగా కోర్ట్ ఎలా తీర్పు చెపుతుంది? దళితులు రావణుడు, శంభూకుడు తమకి మూల పురుషులు అని చెప్పుకుంటున్నారు. సూర్యవంశ క్షత్రియులు సూర్యుడు తమకి మూల పురుషుడని చెప్పుకుంటారు, భరద్వాజ గోత్రస్థులు భరద్వాజ మహర్షి తమ మూల పురుషుడని చెప్పుకుంటారు. ఈ కథలన్నీ నమ్మశక్యమేనా అనే సందేహం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళకి తప్పకుండా వస్తుంది.

పోలీస్ సంస్కరణ అమలు చెయ్యడానికి ఇంత ఆలస్యం ఎందుకు?

Image
 

ఎరవాడ జైలులో కసబ్‌కి ఎన్నడూ బిర్యానీ మేపలేదు

Image
 ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కి ఎరవాడ జైలులో ఎన్నడూ బిర్యానీ మేపలేదు. అప్పట్లో అధికారంలో ఉండిన కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టడానికి బి.జె.పి. ఇప్పుడు కూడా కసబ్‌కి బిర్యానీలు మేపారనే ప్రచారం చేస్తోంది. కసబ్‌కి బిర్యానీలు మేపలేదు అనడానికి సాక్షి ఐ.పి.ఎస్. ఆఫీసర్ మీరన్ బోర్వంకర్. ఆవిడ తన పుస్తకం "కమిషనర్ మేడం"లో కసబ్‌కి ఒక్కసారి కూడా బిర్యానీ పెట్టలేదని రాసారు. జైల్ అధికారులు, జైల్ బయటి అధికారులు తప్పుడు ప్రచారం చేసారని కూడా రాసారు. తాను ఆ టైమ్‌లో అనేక మంది ఆఫీసర్ల ఫోన్లు లాక్కున్నానని కూడా రాసారు. జైల్‌లో కైదీలకు బిర్యానీలు మేపుతారు అని తప్పుడు ప్రచారం చెయ్యడం వల్ల ఏమి జరిగింది? బూటకపు ఎంకౌంటర్లని సమర్థించేవాళ్ళ సంఖ్య పెరిగింది. వీళ్ళని జైల్‌లో పెడితే వీళ్ళకి బిర్యానీలు మేపుతారు కనుక వీళ్ళని ఎంకౌంటర్‌లో చంపెయ్యడం బెటర్ అనేవాళ్ళు తయారయ్యారు. ఈ లింక్ చదవండి: http://montecristo.freedomlover.net.in/2022/12/blog-post.html

మశూచి ఉన్నవాడికే అవసరం లేని ఎసి మామూలు చర్మ రోగం ఉన్నవాడికి అవసరమా?

 కైదీకి మశూచి లేదా ప్లేగ్ లాంటి భయంకరమైన రోగం వస్తే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని అంటు రోగాల వార్డ్‌కి పంపించేస్తారు తప్ప ఎసి రూమ్‌లో పెట్టరు. చంద్రబాబు నాయుడికి వచ్చింది మామూలు చర్మ రోగం. దాని కోసం అతనికి అత్తవారి ఇంటిలాగ ఎసి పెట్టడం అవసరమా? చట్టం ముందు అందరు సమానం కాదని బాగానే నిరూపించారు. ఒడిశా జైల్‌లలో ఒకప్పుడు కైదీలకి ఉప్పుడు బియ్యంతో చేసిన ఇచ్చేవాళ్ళు. ఉప్పుడు బియ్యపు అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినగలం. బియ్యం రేట్ బాగా పెరిగిన తరువాత జైల్ కేంటీన్ కంట్రాక్టర్లు రూపాయి బియ్యం బ్లాక్‌లో కొని వండి కైదీలకి పెట్టడం మొదలు పెట్టారు. మా ఊరిలో లబ్దిదారులు బ్లాక్‌లో అమ్ముకునే బియ్యం బ్రహ్మపురం సెంట్రల్ జైల్‌కి కూడా వెళ్తుంది. నా పొలంలో పని చేసే ట్రాక్టర్ డ్రైవరే ఊరివాళ్ళ దగ్గర బ్లాక్‌లో బియ్యం కొని పక్క ఊరి సాహుకార్లకి ఇస్తాడు, ఆ సాహుకార్లు ఆ బియ్యాన్ని జైల్ కేంటీన్లకి, హాస్టల్ కేంటీన్లకి సప్లై చేస్తారు. జైలులోని కైదీలందరు రూపాయి బియ్యం తినాలి, ఒక మాజీ ముఖ్య మంత్రి మాత్రం ఇంటిలో వండిన ఆహారం జైలుకి తెప్పించుకోవాలి అన్నప్పుడే చట్టం ముందు సమానత్వం మీద డౌట్ రాలేదా?

ఆ రీల్స్ వీడియోలు ఎవరి కోసం?

 రీల్స్ పేరుతో ఫేస్‌బుక్‌లో వస్తున్న వీడియోలు ఎన్ని సార్లు బ్లాక్ చేసినా నాకు కనిపిస్తున్నాయి. అవి నేను సబ్‌స్క్రైబ్ చెయ్యలేదు, అందులో ఆడవాళ్ళు పిరుదులు ఊపి నడుము చూపించే సీన్లు ఉన్నాయి. ఆడవాళ్ళ శరీర భాగాలు చూడాలనుకుంటే నా పొలం పక్కన సెలయేరు దగ్గర అర్ధ నగ్నంగా స్నానం చేసే ఆడవాళ్ళని చూడగలను. వాళ్ళు కొన్ని సార్లు ఛాతి కూడా కనిపించేలా స్నానం చేస్తారు. రీల్స్ వీడియోలు నాకు ఇష్టం లేకపోయినా అవి నాకు ఫేస్‌బుక్‌లో ఎందుకు కనిపిస్తున్నాయి? బ్లాక్ మరియు రెపోర్ట్ చేసినా అవి నాకు ఎలా కనిపిస్తున్నాయి?

మూడెకరాల రైతు - వాయిదాకి కోటికి పైగా తీసుకునే లాయర్లు

Image
 చంద్రబాబు నాయుడు ఎలెక్షన్ వచ్చినప్పుడు తాను మూడెకరాల రైతునని చెప్పుకునేవాడు. గెలిచిన తరువాత వ్యవసాయం వేస్టు అనేవాడు. ఐ.టి., టూరిజం తప్ప ఏదీ అవసరం లేదు అనేవాడు. మళ్ళీ ఎలెక్షన్ టైమ్‌కి తాను మూడెకరాల రైతునని చెప్పుకునేవాడు. ఇప్పుడు స్కిల్ డెవెలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు లాయర్ తన లాయర్‌కి కట్టే ఫీజ్ వాయిదాకి కోటి రూపాయలు పైనే. కంటెస్ట్ ఫీజ్ ఎన్ని కోట్లో చెప్పలేదు. మూడెకరాల రైతు ఇంత ఖరీదైన లాయర్‌లని పెట్టుకుంటాడంటే ఏ చెవిలో పువ్వు పెట్టుకున్నవాడు నమ్మాలి? నాకు అర ఎకరం చెరువు కలిపి మూడెకరాల భూమి ఉంది. 57 సెంట్ల భూమి గొడవలో నేను ఒక వ్యక్తి మీద పెప్పర్ స్ప్రే కొట్టాను. ఆ కేస్‌లో నాకు బెయిల్‌కి పది వేలు, వాయిదాకి వెయ్యి, అక్యూజ్డ్ స్టేట్మెంట్‌కి పాతిక వేలు తీసుకున్నాడు మా లాయర్. ఆ ఫీజ్ మా అమ్మే కట్టింది, ఆవిడ రిటెయిర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కావడం వల్ల. మూడెకరాల భూమి ఉన్నవాడు ఇంత కంటే ఖరీదైన లాయర్ దగ్గరకి వెళ్ళడు.