శాతో దీఫ్

  ఫ్రాన్స్‌లోని మాషే పట్టణానికి దగ్గరలో ఇఫ్ అనే దీవి ఉంది. ఆ దీవిలోని చెరసాలకి శాతో దీఫ్ అని పేరు ఉండేది. ఆ చెరసాల మానవ హక్కులని కాలరాయడానికి పేరు మోసింది. అందులోని కైదీలని చీకటి కొట్లలో బందించేవాళ్ళు. ఎవరైనా పారిపోవడానికి ప్రయత్నిస్తే సెంట్రీలు తుపాకులతో షూట్ చేసి చంపేవాళ్ళు. శవాన్ని బస్తాలో వేసి, బస్తాకి బరువు కట్టి సముద్రంలో పడేసేవాళ్ళు. ఆ చెరసాలలో ఒకప్పుడు అబి ఫరియా అనే క్రైస్తవ సన్యాసి ఉండేవాడు. అతను బొనపార్టిస్టే కానీ అతన్ని చెరసాలలో పెట్టింది బొనపార్ట్ ప్రభుత్వమే. అతనికి కారణం చెప్పకుండా అతన్ని కైదు చేసారు. విచారణ లేకుండా తీర్పు చెప్పే అధికారం కోర్టుకి ఉంటే ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతాయి.

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట