Posts

Do we need schemes such as free ticket?

 మహిళల్లో తహసిల్దార్ ఉద్యోగాలు చేసేవాళ్ళకి కూడా ఫ్రీ టికెట్ ఇవ్వొచ్చా? నేను చేసేది మూడెకరాల వ్యవసాయం కానీ మా అమ్మ రిటెయిర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కావడం వల్ల నాకు రేషన్ కార్డ్ ఇవ్వలేదు. మహిళలకి ఉచిత బస్సు టికెట్ వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి వెళ్ళేవాళ్ళలో ఎక్కువగా మహిళలే ఉంటారు. ఫ్రీ బస్సు టికెట్ వల్ల హాజరు అవ్వాల్సిన అవసరం లేని దూరపు బంధువుల పెళ్ళికి కూడా వెళ్ళి ఫ్రీగా తినాలనుకునేవాళ్ళు కూడా ఉంటారు. మామూలుగా మగవాళ్ళకి పేరంటానికి హాజరు అవ్వడానికి టైమ్ లేకపోతే ఇంటిలోని ఆడవాళ్ళని పంపిస్తారు. ఇప్పుడు మగవాళ్ళు టైమ్ ఉన్నా హాజరు అవ్వకుండా ఆడవాళ్ళని పంపించగలరు.

ప్రోపగాండా భాష మాట్లాడితే మిమ్మల్ని తింగరోళ్ళు అనుకుంటారు

జైలులో కైదీని లోపల పెట్టే ముందు జైలు సూపరింటెండెంట్ కైదీకి కులం పేరు అడుగుతాడు. అతను "ఈ రోజుల్లో కులాలు లేవు" అనో, "నేను నాస్తికుణ్ణి కనుక నాకు కులం వర్తించదు" అనో చెపితే అతన్ని తింగరోడు అనుకుంటారు. పెళ్ళి సంబంధం కోసం వెళ్ళినప్పుడు "మీది ఏ కులం?" అని అడుగుతారు తప్ప "మీది ఏ సామాజిక వర్గం?" అని అడగరు. "మాది ఫలానా సామాజిక వర్గం" అని చెప్పుకున్నా విచిత్రంగా చూస్తారు. ప్రోపగాండా భాష మాట్లాడితే ఇలాగే నవ్వులపాలు అవుతాము. నేను జైలులో ఉన్నప్పుడు నేను ఉండిన సెల్‌లో ఒక కోమటోడు, ఒక బాపనోడు ఉండేవారు. ఆ సెల్‌లో ఎక్కువ మంది పేదవాళ్ళు. ఆ బాపనోడు ఆస్తి ఎక్కువ ఉన్నవాడే. అతను పాక్సో కేసులో జైలుకి వచ్చాడు. జైలులో డబ్బున్నవాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి అతను పంచముల పక్కనే పడుకున్నాడు, వాళ్ళ పక్కనే కూర్చుని తిన్నాడు. జైలు నుంచి విడుదల అయిన తరువాత అతను తన కులంవాళ్ళ ఇంటిలోనే తింటాడు తప్ప పంచముల పక్కన కూర్చుని తినడు. ఇండియాలోని జైళ్ళలో దళితులు & ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది. వీళ్ళు లాయర్ ఫీజ్ కట్టలేకపోవడం వల్ల వీళ్ళకి బెయిల్ రావడం లేదు. ఈ విషయం జై

Never be over confident about the masses

 దళితుల చైతన్యాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తే దళితవాదమే ఓడిపోతుంది. దళితులందరు నాస్తికులనో, హేతువాదులనో, బౌద్ధులనో అర్థం వచ్చేలా కొంత మంది దళితవాదులు, కొంత మంది హిందుత్వవాదులు ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు. దళితుల్లో కూడా రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు హిందు ఆచారమైన కట్నం పాటిస్తున్నారు. రాయగడ జిల్లాలో వరకట్న నిషేధ చట్టం కేసులోని నిందుతుల్లో కొంత మంది దళితులు & ఆదివాసులు. ఇక్కడ ఆదివాసుల్లో వరకట్న ఆచారం లేదు. అయినా పట్టణ ప్రాంతాల్లో స్థిరపడిన ఆదివాసులు కట్నం తీసుకుంటున్నారు. మత గ్రంథాలు చదవని చదువురానివాళ్ళ కంటే అవి చదివిన చదువుకున్నవాళ్ళలో హిందుత్వ భావజాలం ఎక్కువ ఉంటుంది.

దళితులు అందరు నాస్తికులు, హేతువాదులు, బౌద్ధులా?

దళితులు అందరు నాస్తికులనో, హేతువాదులనో, బౌద్ధులనో నమ్మేవాళ్ళు ఉన్నారు. అలా నమ్మేవాళ్ళలో కొంత మంది నాస్తికులు, కొంత మంది మత విశ్వాసులు. హిందు మతం కుల వ్యవస్థని, లింగ వివక్షని సమర్థించడానికి పుట్టిందని కొంత మంది చదువుకున్నవాళ్ళకి కూడా తెలియదు. దీన్ని అడ్వాంటెజ్‌గా తీసుకునే కొంత మంది ఈ రోజుల్లో కుల వివక్ష, లింగ వివక్ష లేదని వాదిస్తారు. దళిత రిటైర్డ్ ఐ.పి.ఎస్. ఆఫీసర్ పంతులు సమేతంగా పూజలు చెయ్యడంపై కొంత మంది బహుజనవాదులు ఆశ్చర్యపోతున్నారు, కొంత మంది బహుజనవాద వ్యతిరేకులు వెక్కిరిస్తున్నారు. దళితులందరు నాస్తికులు కానప్పుడు ఇక్కడ ఆశ్చర్యపోవడానికో, వెక్కిరించడానికో ఏముంది? హిందు మతం కుల వ్యవస్థని సమర్థించడానికి పుట్టిందని తెలియక మా ఊరిలోనే ఆదివాసులు దసరా జాతర నిర్వహిస్తున్నారు. దీపావళి నాడు మా ఊరిలో పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టేది దళితవీధి వాసులు. రావణుడు తమ తాత అని చెప్పి రావణ దహణాన్ని అడ్డుకుంటాం అనే బహుజనవాదులు దీని గురించి ఏమి చెపుతారు? మా ఊరిలో రెండు వీధులు ఉన్నాయి. ఒకటి ఆదివాసి వీధి, ఒకటి దళిత వీధి. దళితుల కంటే ఆదివాసులకి వ్యవసాయ భూమి ఎక్కువ. ఇక్కడ కొంత మంది ఆదివాసులు దళితుల ఇంటిలో భోజనం చెయ

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో బాక్సైట్ మైనింగ్ గురించి

Image
<

ప్రభుత్వ ఉద్యోగి మంచివాడా కాదా అనేదానితో ప్రభుత్వాన్ని కూల్చేవాళ్ళకి సంబంధం ఉంటుందా?

Image
 పోలీస్ ఆఫీసర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి. పోలీస్ ఆఫీసర్‌కి మార్క్సిజం తెలిసినంతమాత్రాన అతను కమ్యూనిస్ట్ కన్స్పిరేటర్స్‌ని వదిలిపెట్టలేడు. ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీపరుడా, కాదా అనేది కమ్యూనిస్ట్ కన్స్పిరేటర్స్‌కి సంబంధం లేని విషయం. కొంత మంది ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు "ఉమేశ్‌చంద్ర నిజాయితీపరుడైన ఆఫీసర్ అనీ, నక్సల్స్ అతన్ని అన్యాయంగా చంపారనీ". అతనేమీ అంత నిజాయితీపరుడు కాదు. అతను కరీమ్నగర్ ఎస్.పి.గా ఉన్నప్పుడు చాలా మంది సస్పెండెడ్ కానిస్టెబుళ్ళపై సస్పెన్షన్ ఎత్తివేసాడు. నక్సల్స్ చేసేది శ్రమిక వర్గ పోరాటం. పోలీస్ ఆఫీసర్ చేత నిజాయితీగా పని చెయ్యించడం నక్సల్స్ పని కాదు. ఒక ఆఫీసర్ దొరికిపోయిన నక్సల్‌ని కోర్టులో హాజరుపరచకుండా ఎక్స్‌ట్రా జుడిషియల్ కిల్లింగ్‌లో చంపితే అలా ఎందుకు చంపావు అని ఆ ఆఫీసర్‌ని అడిగే హక్కు నక్సల్స్‌కి ఉంటుంది. రాచరికంలో కంటే రిపబ్లిక్‌లో ఎక్కువ స్వేచ్ఛ ఉన్నప్పుడు రాజు మంచివాడైనంతమాత్రాన, అతను చెరువులు & సత్రాలు కట్టినంతమాత్రాన రిపబ్లికన్లు రాచరికాన్ని కూల్చకుండా వదిలేస్తారా? పెట్టుబడిదారీ వ్యవస్థలో కంటే కమ్యూనిజంలో స్వేచ్ఛ ఎక్కువ అని నమ్మేవాడు పెట్టుబడిదారీ చట

అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు చెప్పే టాక్స్ లెక్కలు మేడి పండు, పొట్ట విప్పితే పురుగులు

Image