Posts

Showing posts from December, 2022

బూటకపు ఎంకౌంటర్లని సమర్థించేవాళ్ళకి జైలు కూడు ఎలా ఉంటుందో తెలియదు

 జైలులో ఎక్కడా డీసెంట్ ఫుడ్ దొరకదు జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారు అని చెప్పి బూటకపు ఎంకౌంటర్లని చట్టబద్దం చెయ్యాలనుకునేవాళ్ళకి జైలు కూడు ఎలా ఉంటుందో తెలియదు. పాత కేసులో వాయిదాలకి హాజరు అవ్వలేదని నన్ను ఐదు రోజులు రాయగడ సబ్-జైల్‌లో పెట్టారు. ఆ జైలులో ఉదయం పూట ఉప్మా, మధ్యాహ్నం & సాయింత్రం అన్నం ఇస్తారు. జైల్ కేంటీన్ కాంట్రాక్టర్ రూపాయి బియ్యాన్ని బ్లాక్‌లో కొని వండిన అన్నం అది. రూపాయి బియ్యాన్ని కుక్కలు కూడా తినవు అని మాకు తెలిసిన ఒక రిక్షావాడు అనేవాడు. అదే బియ్యాన్ని జైలు కేంటీన్ కాంట్రాక్టర్లు కొని కైదీలకి వండి పెడతారు, హాస్టల్ కేంటీన్ కాంట్రాక్టర్లు కొని విద్యార్థులకి పెడతారు. మా నాన్నగారిది రాయగడ జిల్లా శేసిఖల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపలగూడ గ్రామం. ఈ ఊరిలోని లబ్దిదారులు అమ్ముకునే రేషన్ బియ్యాన్ని కొనే స్మగ్లర్లు దాన్ని బరంపురం, భుబనేశ్వర్ జైల్‌ల కేంటీన్‌లకి కూడా సప్లై చేస్తారు. ఈ ఊరిలో ఎక్కువ మంది కూలీవాళ్ళు, ఇక్కడ 40 మందికి మాత్రమే సొంత వ్యవసాయ భూమి ఉంది. రూపాయి బియ్యాన్ని కూలీవాడు కూడా తినడు కానీ జైల్ కేంటీన్‌లో, హాస్టల్ కేంటీన్‌లో దానితో వండిన అన్నమే దొరుకుతుంది. జైలులో

మద్యం తాగడానికి అవసరం లేని లైసెన్స్ తుపాకీ కొనడానికి అవసరమా?

 మద్యం తాగిన మత్తులో మానభంగం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి కానీ తుపాకీతో బెదిరించి మానభంగం చేసిన ఘటనలు తక్కువ. విచిత్రం ఏమిటంటే మద్యం తాగడానికి లైసెన్స్ అవసరం లేదు కానీ తుపాకీ కొనడానికి లైసెన్స్ అవసరం. తుపాకీ కొన్న తరువాత దాన్ని డి.ఎస్.పి.కి చూపించాలి. డి.ఎస్.పి. దాని రంధ్రం డయామీటర్, బారెల్ పొడవు కొలుస్తాడు. ఆ తుపాకీ ఎండార్స్ అవ్వకపోతే దాన్ని పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చెయ్యాలి. మద్యం కొనడానికి లైసెన్స్ అవసరం లేదు, అది తాగడానికి ఎండార్స్‌మెంట్ అవసరం లేదు. ఆ మద్యాన్ని రెక్టిఫైడ్ స్పిరిట్‌తో కల్తీ చేసినా, అమ్మోనియాతో కల్తీ చేసినా ఎవరి ఎండార్స్‌మెంట్ లేకుండా అది తాగెయ్యవచ్చు. అమ్మోనియాతో కల్తీ చేసిన మద్యం మూడు గ్లాసులు తాగితే నిశా అవుతుంది. బాటెరీ నుంచి తీసిన కెమికల్స్‌తో కల్తీ చేసిన్స్ మద్యం ఒక్క గ్లాస్ తాగినా నిశా అవుతుంది. ఒడిశా పోలీసులు సారా వ్యాపారుల దగ్గర నెలకి రెండు వేలు చొప్పున మామూళ్ళు వసూలు చేస్తారు. లైసెన్స్ లేని తుపాకులు తయారు చేసేవాళ్ళ దగ్గర మాత్రం అలా మామూళ్ళు తీసుకోరు. తాగుబోతులు పట్టపగకు సారా తాగగలరు కానీ వేటగాళ్ళు రాత్రి పూటే లైసెన్స్ లేని తుపాకులు పట్టుకుని తిరుగుతుంటారు.

జనంలో జెండర్ సెన్సిటైజేషన్ కలగనంత వరకు మానభంగాలు జరుగుతూనే ఉంటాయి

 ఎంకౌంటర్ల వల్ల మానభంగాలు తగ్గుతాయని నమ్మే గొర్రెల మందని కూడా ఉద్దేశించి ఇది రాస్తున్నాను. ముందు వేరే విషయం చెపుతాను. ఫేస్‌బుక్‌లో డాక్టర్ యడవల్లి రమణ గారు రాసారు "నాగరిక సమాజానికి కావలసినది జెండర్ సెన్సిటైజేషన్, పెళ్ళాం మొగుణ్ణి కొడుతున్నట్టు చూపించే బాపు గారి కార్టూన్లు జెండర్ ఇన్సెన్సిటివ్" అని. నేను ఇలా కామెంట్ చేసాను "రేప్ లాంటి జెండర్ సెన్సిటివ్ నేరాలు లింగ వివక్ష ఉన్న సమాజంలోనే జరుగుతాయి, ఈ రోజుల్లో లింగ వివక్ష లేదు అని నమ్మేవాళ్ళకి జెండర్ సెన్సిటైజేషన్ లేనట్టే" అని. రమణ గారు నవ్వుకున్నారు. ఈ రోజుల్లో లింగ వివక్ష లేదు అనేవాడు ఎవడూ ఆడపిల్లకి ఆస్తిలో వాటా ఇవ్వడు, కట్నం ఇచ్చి ఆమెని తన కంటే ధనవంతుడికి ఇచ్చి పెళ్ళి చెయ్యడానికే ప్రయత్నిస్తాడు. ఒకప్పుడు నాకు కూడా జెండర్ సెన్సిటైజేషన్ లేదు. ఆడపిల్లని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామనేది కోమటోళ్ళు. కోమటోళ్ళలో ఫీమేల్ సెక్స్ రేషియో తక్కువ, ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ కూడా తక్కువ. వ్యవసాయం చేసేవాళ్ళకి ఆ సమస్య ఉండదు కానీ వ్యవసాయం చేసేవాళ్ళకి పెళ్ళి సంబంధాలు దొరకవు అని ఈనాడు పత్రికలో రాస్తే నేను కూడా నమ్మేసాను. ఈనాడు

మన సమాజాన్ని 1815 నాటి రాచరిక భూస్వామ్య వ్యవస్థకి దిగజారుద్దామా?

రేపిస్టులని ఎంకౌంటర్ చెయ్యాలని సోషల్ మీడియాలో ప్రతివాడు అరుస్తాడు. జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారని కూడా వీళ్ళు ఏడుస్తారు. జైలులో కైదీలకి బిర్యానీలు మేపేంత బడ్జెట్ జైళ్ళ శాఖ ఐ.జి.కి ఉండదు అని వీళ్ళకి తెలియదు.   ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో నవలలో ప్రాసిక్యూటర్ ఒక రాజభక్తుడు కానీ అతని తండ్రి రాజద్రోహి నెపోలియన్‌తో సంబంధం పెట్టుకుంటాడు. ఆ రహస్యం బయటపడకూడదని ప్రాసిక్యూటర్ హీరోని విచారణ లేకుండానే శాతో దీఫ్ అనే చీకటి చెరసాలలో కైదు చేస్తాడు. 1815లో ప్రపంచంలోని ఏ దేశంలోనూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదు. అప్పట్లో ప్రాసిక్యూటర్‌కి ఇలాంటి తప్పులు చెయ్యడం సాధ్యమే. రేపిస్టులని విచారణ లేకుండా ఎంకౌంటర్ చేసి మన సమాజాన్ని 1815 నాటి రాచరిక భూస్వామ్య వ్యవస్థకి దిగజారుద్దామా?  ఇండియాలో అదే పరిస్థితి వస్తే ఏమవుతుంది? పిచ్చిదాయి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వదనుకుని ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు పిచ్చిదాన్ని రేప్ చేసాడనుకుందాం. ఆ రేప్‌ని చూసినవాణ్ణి ఆ పోలీస్ ఆఫీసర్ బూటకపు ఎంకౌంటర్లో చంపడని గ్యారంటీ ఏమిటి? ఒక పోలీస్ ఆఫీసర్ తమ్ముడు నక్సల్ లీడర్. ఆ ఆఫీసర్ తన తమ్ముణ్ణి సరెండర్ చెయ్యించలేకపోయాడు. ఈ రహస్యం తెలిసినవాణ్ణి కూడా

ఒక ఘటన తమ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగలేదు అని పోలీసులు చెపితే ఏమి చెయ్యాలి?

రెండు పోలీస్ స్టేషన్ల సరిహద్దులో నేరం జరిగితే అరెస్ట్ చేసే అధికారం రెండు స్టేషన్ల ఆఫీసర్లకీ ఉంటుంది. నాకు తెలిసిన ఒక ఆంధ్ర సారా వ్యాపారిని ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. అతని భట్టీ ఒడిశా సరిహద్దులో ఉంది, పాక ఆంధ్రలో ఉంది. ఒడిశా అధికారులు అతని భట్టీని ధ్వంసం చేసి ఆంధ్రలో ఉన్న అతని పాకకి వచ్చి అరెస్ట్ చేసారు. కిడ్నాప్, రేప్ లాంటివి జరిగినప్పుడు మాత్రం ఘటన స్థలం తమ పోలీస్ స్టేషన్ పరిధిలో లేదని చెప్పి పోలీసులు తప్పించుకుంటారు, ఎఫ్.ఐ.ఆర్. రాస్తే ఇవెస్టిగేట్ చెయ్యాల్సివస్తుందని బద్దకించడం వల్ల. పోలీసులు అలా చేస్తే ఎస్.పి. ఆఫీస్‌లో పబ్లిక్ గ్రీవెన్స్ ఇవ్వాలి. ఒక ఘటన వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందనిపిస్తే ఎఫ్.ఐ.ఆర్.ని ఆ పోలీస్ స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ చెయ్యాలి. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ తరువాతే ట్రాన్స్‌ఫర్ చెయ్యాలి కనుక పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. రాయకుండా కుంటి సాకులు చెపుతారు. రైల్వే పోలీసులు ఎక్కువగా జీరో ఎఫ్.ఐ.ఆర్.లు రాస్తారు. కదులుతున్న ట్రెయిన్ ఏ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నప్పుడు నేరం జరిగిందో తెలుసుకుని ఆ రైల్వే పోలీస్ స్టేషన్‌కి దాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. జిల్లా పోలీసులు కూడా ఆ పని

రేప్ విషయంలో తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఉండరా?

 నాకు జైలులో కొంత మంది రేప్, పాక్సొ(చిన్న పిల్లలతో సెక్స్) కేస్ నిందితులు పరిచయమయ్యారు. వాళ్ళలో ఒకడు 18 ఏళ్ళ యువకుడు, అతని లవర్ వయసు 19 ఏళ్ళు. అతను తన లవర్‌తో సంభోగం చేస్తోంటే ఆమె తల్లితండ్రులు పట్టుకుని అతని మీద రేప్ కేస్ పెట్టారని అతను అంటున్నాడు. వాళ్ళిద్దరిదీ ఒకే వీధి. అతనికి 10 ఎకరాల భూమి ఉంది, అతని లవర్ కుటుంబానికి 20 ఎకరాల భూమి. ఆమె తండ్రి ఒక రాజకీయ నాయకుడు. రాజకీయ ఒత్తిళ్ళతోనే తన మీద రేప్ కేస్ రెజిస్టర్ చేసారని అతను అంటున్నాడు. బట్టలు చిరగకపోతే రేప్ కేస్ ఋజువు అవ్వదు అని నేను అన్నాను. వీర్యపు మరకల్ని టెస్ట్‌కి పంపించారు అని అతను అన్నాడు. కత్తితోనో, తుపాకీతోనో బెదిరించి రేప్ చేసినట్టైతే బట్టలు చిరగకపోయినా కేస్ ఋజువు అవుతుంది. అతని దగ్గర కత్తి లేదు, తుపాకీ లేదు. ఇంకొకడు తాను సొంత మరదల్ని తీసుకెళ్ళానని చెపుతున్నాడు, తన మీద రేప్ కేస్ పెట్టారని కూడా అన్నాడు. బాల్యవివాహం కోసం అమ్మాయిని తీసుకెళ్తే కిడ్నాప్ కేస్ ఋజువు అవుతుంది కానీ రేప్ కేస్ ఋజువు అవ్వదు. ఇంకొకడు తన వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకి చిన్న వయసులో పెళ్ళయ్యింది. ఆమె వయసు ఎంతో తెలుసుకోకుండా ఆమెతో ఆ పని చేసాడు, పాక్

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట

Image
2017లో నేను ఒడిశాలోని ఒక ఆదివాసీ గ్రామం దగ్గర తిరుగుతున్నప్పుడు నాకు ఒక కాపువాడు తారసపడ్డాడు. అప్పుడు నా వయసు 34 ఏళ్ళు. అతను నాకు పెళ్ళయ్యిందా అని అడిగాడు. కాలేదని చెప్పాను. అతను నమ్మలేదు. అతను అన్నాడు "ఆడపిల్లని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామనేది కోమటోళ్ళు. ఆ కులంలో ఆడపిల్లలు తక్కువ (రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుడితే పాలు సరిగా పట్టరు). వ్యవసాయం చేసేవాళ్ళలో ఆడపిల్లలకి అంత కరువు ఉండదు" అని. అతను చెప్పింది నాకు అర్థమైపోయింది. హిందు మతం అనేది కుల వ్యవస్థని, లింగ వివక్షని సమర్థించడానికి పుట్టినది. కోమటోళ్ళు, బాపనోళ్ళలో ఆడపిల్లల సంఖ్య తక్కువే ఉంటుంది. వ్యవసాయం చేసేవాళ్ళకి పెళ్ళి సంబంధాలు దొరకవు అని ఈనాడు పత్రికలో రాస్తే మా అమ్మ నమ్మేసింది. మా అమ్మగారి తండ్రి చేసినది వ్యవసాయమే కానీ మా అమ్మ బాపనోళ్ళ అమ్మాయిల కలిసి చదువుకుంది. వ్యవసాయం చేసేవాళ్ళ సంస్కృతి మా అమ్మకి తెలియదు.  2013లో ఈనాడు పత్రికలో మెయిన్ పేజ్‌లోనే ఒక ఆర్టికల్ ప్రచురితమయ్యింది. ఆ ఆర్టికల్‌లో వ్యవసాయం చేసేవాళ్ళకి, నిరుద్యోగులకి పెళ్ళి సంబంధాలు దొరకవు అని రాసారు. వ్యవసాయం చేసేవాళ్ళు వేరు, నిరుద్యోగులు వేరు. ఇండ