Posts

Showing posts from July, 2023

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

Image
 సినిమాల్లో విలన్ కొడుకు ఏక్సిడెంట్ చేస్తాడు, విలన్ కార్ డ్రైవర్‌ని సరెండర్ చెయ్యిస్తాడు. నిజజీవితంలో పోలీసులు సరెండర్‌ని అంత సులభంగా నమ్మరు. మా ఊరి బస్ ఓనర్ లైసెన్స్ లేని డ్రైవర్ చేత బస్ నడిపించాడు. అది ఏక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు. డ్రైవర్‌కి లైసెన్స్ లేదనే విషయం బయటపడకూడదని ఓనర్ తన సొంత డ్రైవింగ్ లైసెన్స్ చూపించి సరెండర్ అయ్యాడు. పోలీసులు ఓనర్ మీదే కేస్ రాసారు. ఇప్పుడు ఓనర్ కోర్ట్ చుట్టూ తిరుగుతున్నాడు. నక్సల్ సరెండర్స్‌ని కూడా పోలీసులు అంత సులభంగా నమ్మరు. 2011లో సరెండర్ అయిన దున్న కేశవరావుకి ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన దున్న కేశవరావు ఒడిశాలో పని చేసాడు. అతను తమకి చెప్పకుండా లొంగిపోయాడని ఒడిశా పోలీసులు ఆంధ్ర పోలీసులకి చెప్పడంతో ఆంధ్ర పోలీసులు అతన్ని ఒడిశా అధికారులకి అప్పగించారు. ఒడిశా అధికారులు అతనికి భుబనేశ్వర్ జైలులో నరకం చూపించారు. కేశవరావు ఒడిశా పోలీసులకి చెప్పే లొంగిపోయాడు. అతను డి.జి.పి. ముందు లొంగిపోవడం వల్ల అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. రెండు రాష్ట్రాలలో అతనితో కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు అడ్రెస్‌లు మార్చేసారు. వాళ్ళ అడ్రెస్‌లు చెప్పలేకపోవడం వల్

శంకర్ దాదాలు IAS, IPS అధికారులైతే ఏమవుతుంది?

Image
 గన్ లైసెన్స్ అప్లికేషన్‌ని హెల్దీ కండిషన్‌లో డీల్ చెయ్యడం చేతకాని SPకి DIG ప్రమోషన్ వచ్చింది ఆ అధికారి పేరు డాక్టర్ చిత్తూరి మాచిరాజు త్రివిక్రమ వర్మ. ఆయన చదివింది MBBS కానీ ఆయన శంకర్ దాదా కంటే తెలివైనవాడు కాదు. చాలా సిసి కెమెరాలకి ఆడియో రెకార్డింగ్ సౌకర్యం ఉండదు. ఆఫీస్ సెక్యూరిటీ ఉద్యోగులు సిసి కెమెరాల ముందు కూడా లంచం అడగగలరు. లంచం డైరెక్ట్‌గా అడగకుండా ప్రాక్టికల్ జోకులు కూడా వెయ్యగలరు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయపు సెక్యూరిటీ ఉద్యోగులు నా మీద అలాంటి ప్రాక్టికల్ జోకులే వేసారని నేను త్రివిక్రమ వర్మ గారికి లెటర్లు రాసినా, వాట్సాప్‌లో చెప్పినా అర్థం కాలేదు. నేను 2017 జనవరి 18న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లో గన్ లైసెన్స్ కోసం అప్లై చేసాను. అప్పట్లో పొట్నూరు రజనీకాంతరావు గారు జాయింట్ కలెక్టర్. ఆయన శస్త్ర నియమావళి 2016 చదవలేదు. ఆర్మ్‌స్ రూల్స్ 2016 ప్రకారం జిల్లా కలెక్టర్ స్టేట్ వేలిడ్ గన్ లైసెన్స్ ఇవ్వగలడు. ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ఏరియా వేలిడిటీ రాష్ట్ర హోమ్ సెక్రేటరీ మాత్రమే ఇవ్వగలడు. నా ఆస్తి ఒడిశాలో ఉందని తెలిస్తే నన్ను హోమ్ సెక్రేటరీ ఆఫీస్‌కి వెళ్ళమని కలెక్టర్ వెంటనే చెప్పాలి.

కుల సమస్య పరిష్కరించకుండా కామన్ సివిల్ కోడ్ ఎలా అమలు చేస్తారు?

 కామన్ సివిల్ కోడ్ వస్తే హిందువుల్లో ఉన్న కుల వ్యవస్థని ముస్లింలకి & క్రైస్తవులకి వర్తింపచేస్తారా లేదా హిందువుల్లో కులాలు లేవు అని చెప్పి రిజర్వేషన్‌ని ఎత్తి వేస్తారా? https://kadhalu.wordpress.com/2016/10/05/%e0%b0%89%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8c%e0%b0%b0-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b1%83%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ad/  నేను ఈ మధ్యనే కాకినాడ జిల్లా పెదబ్రహ్మదేవం గ్రామంలో ఒక కులాంతర వివాహానికి సాక్షి సంతకం పెట్టడానికి వెళ్ళాను. అది అమ్మాయి తల్లితండ్రులకి ఇష్టం లేని పెళ్ళి. ఆ అమ్మాయి వీధిలో ఉన్నవాళ్ళు తమ కులం పేరు చెప్పలేదు కానీ మా కులం పేరు అడిగారు. "మీది ఏ కులానికి ఎక్కువ, ఏ కులానికి తక్కువ" అని కూడా అడిగారు. మాది సొంత వ్యవసాయ భూమి ఉన్న కులం అని చెప్పాను. ఆ అమ్మాయి తల్లితండ్రులు భూమి లేని కూలీలు కానీ మాది ఏ కులానికి ఎక్కువో, ఏ కులానికి తక్కువో అడిగారు. ఈ రోజుల్లో కులాలు లేవు అనే ప్రోపగాండాని చిన్నప్పటి నుంచి వింటున్నాను. పల్లెటూర్లలో కులం పేరు బహిరంగంగా అడిగేవాళ్ళని ఇప్పుడు కూడా చూస్తున్నాను

చాటని, జల్లెడని హిందీలో ఏమంటారో తెలుగు రాష్ట్రాల బిజెపి నేతలని అడిగితే చాట-బుచికి కామెడీ అవుతుంది

Image
  నేను సినిమాలు చూసి హిందీ నేర్చుకున్నాను. నా హిందీ మాటలు నేటివ్ హిందీ స్పీకర్‌విలాగే ఉంటాయి. బిజెపివాళ్ళు హిందీ సినిమాలని గానీ సాహిత్యాన్ని గానీ ప్రోత్సహించడం లేదు. వాళ్ళు హిందీ రానివాళ్ళు భారతీయులు కాదు అంటున్నారు. ఆ పార్టీలో ఉన్న దక్షిణ భారతీయ నాయకుల్లో ఎంత మందికి హిందీ వచ్చో నరేంద్ర మోదీని అడిగితే వాళ్ళ చొక్కాలకి ఉన్న రంధ్రాలే బయటపడతాయి. ఛలనీకో కిత్నే కానో హోతే హే, నరేంద్ర మోదీ కీ కమీజ్ కో భీ ఉత్నే కానో హై. జల్లెడకి ఎన్ని చిల్లులో మన తెలుగు రాష్ట్రాల బిజెపి లీడర్లని అడిగినా నాలుక కరుచుకుంటారు.  నేను ఇన్ని హిందీ సినిమాలు చూసాను కానీ జీలుగు చెట్టుని హిందీలో ఏమంటారో నాకు ఇప్పుడు కూడా తెలియదు. అల్లంని హిందీలో అద్రక్ అంటారు కానీ రైల్వే స్టేషన్‌లో టీ అమ్ముకునే తెలుగువాళ్ళు హిందీ ప్రయాణికుల ముందు అల్లం చాయ్ అని అరవడం, వీళ్ళ అరుపు ఆ ప్రయాణికులకి అర్థం కాకపోవడం చూసాను.

పుణ్య భూమి నా దేశం అన్నది ఇందుకే, అనుభవించు రాజా!

Image