Posts

Showing posts from December, 2023

Do we need schemes such as free ticket?

 మహిళల్లో తహసిల్దార్ ఉద్యోగాలు చేసేవాళ్ళకి కూడా ఫ్రీ టికెట్ ఇవ్వొచ్చా? నేను చేసేది మూడెకరాల వ్యవసాయం కానీ మా అమ్మ రిటెయిర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కావడం వల్ల నాకు రేషన్ కార్డ్ ఇవ్వలేదు. మహిళలకి ఉచిత బస్సు టికెట్ వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి వెళ్ళేవాళ్ళలో ఎక్కువగా మహిళలే ఉంటారు. ఫ్రీ బస్సు టికెట్ వల్ల హాజరు అవ్వాల్సిన అవసరం లేని దూరపు బంధువుల పెళ్ళికి కూడా వెళ్ళి ఫ్రీగా తినాలనుకునేవాళ్ళు కూడా ఉంటారు. మామూలుగా మగవాళ్ళకి పేరంటానికి హాజరు అవ్వడానికి టైమ్ లేకపోతే ఇంటిలోని ఆడవాళ్ళని పంపిస్తారు. ఇప్పుడు మగవాళ్ళు టైమ్ ఉన్నా హాజరు అవ్వకుండా ఆడవాళ్ళని పంపించగలరు.

ప్రోపగాండా భాష మాట్లాడితే మిమ్మల్ని తింగరోళ్ళు అనుకుంటారు

జైలులో కైదీని లోపల పెట్టే ముందు జైలు సూపరింటెండెంట్ కైదీకి కులం పేరు అడుగుతాడు. అతను "ఈ రోజుల్లో కులాలు లేవు" అనో, "నేను నాస్తికుణ్ణి కనుక నాకు కులం వర్తించదు" అనో చెపితే అతన్ని తింగరోడు అనుకుంటారు. పెళ్ళి సంబంధం కోసం వెళ్ళినప్పుడు "మీది ఏ కులం?" అని అడుగుతారు తప్ప "మీది ఏ సామాజిక వర్గం?" అని అడగరు. "మాది ఫలానా సామాజిక వర్గం" అని చెప్పుకున్నా విచిత్రంగా చూస్తారు. ప్రోపగాండా భాష మాట్లాడితే ఇలాగే నవ్వులపాలు అవుతాము. నేను జైలులో ఉన్నప్పుడు నేను ఉండిన సెల్‌లో ఒక కోమటోడు, ఒక బాపనోడు ఉండేవారు. ఆ సెల్‌లో ఎక్కువ మంది పేదవాళ్ళు. ఆ బాపనోడు ఆస్తి ఎక్కువ ఉన్నవాడే. అతను పాక్సో కేసులో జైలుకి వచ్చాడు. జైలులో డబ్బున్నవాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి అతను పంచముల పక్కనే పడుకున్నాడు, వాళ్ళ పక్కనే కూర్చుని తిన్నాడు. జైలు నుంచి విడుదల అయిన తరువాత అతను తన కులంవాళ్ళ ఇంటిలోనే తింటాడు తప్ప పంచముల పక్కన కూర్చుని తినడు. ఇండియాలోని జైళ్ళలో దళితులు & ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది. వీళ్ళు లాయర్ ఫీజ్ కట్టలేకపోవడం వల్ల వీళ్ళకి బెయిల్ రావడం లేదు. ఈ విషయం జై

Never be over confident about the masses

 దళితుల చైతన్యాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తే దళితవాదమే ఓడిపోతుంది. దళితులందరు నాస్తికులనో, హేతువాదులనో, బౌద్ధులనో అర్థం వచ్చేలా కొంత మంది దళితవాదులు, కొంత మంది హిందుత్వవాదులు ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు. దళితుల్లో కూడా రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు హిందు ఆచారమైన కట్నం పాటిస్తున్నారు. రాయగడ జిల్లాలో వరకట్న నిషేధ చట్టం కేసులోని నిందుతుల్లో కొంత మంది దళితులు & ఆదివాసులు. ఇక్కడ ఆదివాసుల్లో వరకట్న ఆచారం లేదు. అయినా పట్టణ ప్రాంతాల్లో స్థిరపడిన ఆదివాసులు కట్నం తీసుకుంటున్నారు. మత గ్రంథాలు చదవని చదువురానివాళ్ళ కంటే అవి చదివిన చదువుకున్నవాళ్ళలో హిందుత్వ భావజాలం ఎక్కువ ఉంటుంది.