ఆడదానికి హిందు మతం మీద నమ్మకం ఉంటే తన భర్త చనిపోయాడని మేట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో రాసి చూసుకోవచ్చు

 రమా సుందరి అనే రచయిత్రి ఉన్నారు. ఆవిడ నాస్తికురాలు కావడం వల్ల బొట్టు పెట్టుకోదు. గుంటూరులోని ఒక అపార్ట్‌మెంట్‌వాళ్ళు ఆవిడని ముస్లిం అనో, విధవ అనో అనుకుని ఇల్లు అద్దెకి ఇవ్వడం కుదరదు అనేసారు. ఈ రోజుల్లో కుల వివక్ష, లింగ వివక్ష లేదు అనే ప్రోపగాండాని కొంత మంది స్త్రీలు కూడా నమ్ముతున్నారు. అలా నమ్మే స్త్రీ పెళ్ళి కానిది అయితే తన భర్త చనిపోయాడని మేట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో రాసి చూసుకోవచ్చు, పెళ్ళైనది అయితే బొట్టు తీసేసి అద్దె ఇంటి కోసం వెతకొచ్చు. ఆ రెండిటిలో ఏది చేసినా ఎంత మంది ఆమె మీద మొహం చాటేస్తారో తెలిసి వస్తుంది.

విశాఖపట్నంలో ఒకడు తాను ఎన్.ఆర్.ఐ.నని చెప్పుకుని మేట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ పెట్టాడు. భర్త చనిపోయిన స్త్రీలు & విడాకులు తీసుకున్న స్త్రీల చేత తన బ్యాంక్ అకౌంట్‌లో పైసలు డిపాజిట్ చెయ్యించుకుని పారిపోయాడు. అతని మీద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేస్ రెజిస్టర్ అయ్యింది. భర్త చనిపోయిన స్త్రీ రెండవ పెళ్ళి చేసుకోవాలనుకుంటే తనకి తెలిసిన వ్యక్తినే కాంటాక్ట్ చెయ్యొచ్చు. బ్లాగులు & ఫేస్‌బుక్‌లో స్త్రీవాదం కబుర్లు చెప్పేవాడు కూడా భర్త చనిపోయిన స్త్రీని పెళ్ళి చేసుకోడు. అంత కంటే తెలిసిన వ్యక్తిని కన్విన్స్ చెయ్యడం సులభం.

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట