సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

 సినిమాల్లో విలన్ కొడుకు ఏక్సిడెంట్ చేస్తాడు, విలన్ కార్ డ్రైవర్‌ని సరెండర్ చెయ్యిస్తాడు. నిజజీవితంలో పోలీసులు సరెండర్‌ని అంత సులభంగా నమ్మరు. మా ఊరి బస్ ఓనర్ లైసెన్స్ లేని డ్రైవర్ చేత బస్ నడిపించాడు. అది ఏక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు. డ్రైవర్‌కి లైసెన్స్ లేదనే విషయం బయటపడకూడదని ఓనర్ తన సొంత డ్రైవింగ్ లైసెన్స్ చూపించి సరెండర్ అయ్యాడు. పోలీసులు ఓనర్ మీదే కేస్ రాసారు. ఇప్పుడు ఓనర్ కోర్ట్ చుట్టూ తిరుగుతున్నాడు.


నక్సల్ సరెండర్స్‌ని కూడా పోలీసులు అంత సులభంగా నమ్మరు. 2011లో సరెండర్ అయిన దున్న కేశవరావుకి ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన దున్న కేశవరావు ఒడిశాలో పని చేసాడు. అతను తమకి చెప్పకుండా లొంగిపోయాడని ఒడిశా పోలీసులు ఆంధ్ర పోలీసులకి చెప్పడంతో ఆంధ్ర పోలీసులు అతన్ని ఒడిశా అధికారులకి అప్పగించారు. ఒడిశా అధికారులు అతనికి భుబనేశ్వర్ జైలులో నరకం చూపించారు. కేశవరావు ఒడిశా పోలీసులకి చెప్పే లొంగిపోయాడు. అతను డి.జి.పి. ముందు లొంగిపోవడం వల్ల అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. రెండు రాష్ట్రాలలో అతనితో కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు అడ్రెస్‌లు మార్చేసారు. వాళ్ళ అడ్రెస్‌లు చెప్పలేకపోవడం వల్లే పోలీసులు కేశవరావుకి నరకం చూపించారు. అతను పబ్లిసిటీ కోసం డి.జి.పి. ముందు లొంగిపోయాడు కానీ ఆ పబ్లిసిటీ వల్ల రెండు రాష్ట్రాల్లో అతని కాంటాక్ట్స్ అడ్రెస్‌లు మార్చేసారు. చివరికి కేశవరావే గంగలో మునిగాడు. పది లక్షలు రివార్డ్‌కి ఆశపడి లొంగిపోతే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అయ్యింది. 

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గురించి ఎ.ఎస్.ఐ.కి తెలిసిన విషయాలే డి.జి.పి.కి తెలుస్తాయి. లొంగిపోవాలనుకుంటే పోలీస్ స్టేషన్‌లోనో, డి.ఎస్.పి. ఆఫీస్‌లోనో, ఎస్.పి. ఆఫీస్‌లోనో లొంగిపోవచ్చు. పబ్లిసిటీకి ఆశపడి డి.జి.పి. ఆఫీస్‌లో లొంగిపోతే ఇలాగే అవుతుంది. లొంగిపోయినవాళ్ళ పునరావాస పథకం చెక్కుల మీద సాధారణంగా ఎస్.పి. సంతకం ఉంటుంది. అవినీతిపరులైన ఎస్.పి.లు లొంగిపోయినవాళ్ళ దగ్గర ఆధార్ కార్డులు లాక్కుని, బేనామీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, పునరావాస పథకం చెక్కుల్ని నొక్కెయ్యగలరు కానీ డి.జి.పి. ముందు లొంగిపోతే ఎక్కువ నష్టమే. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ క్రైమ్ రెకార్డ్స్ బ్యూరోని కాంటాక్ట్ చేసి లొంగిపోయినవాడి మీద ఏ జిల్లాల్లో కేసులు ఉన్నాయో తెలుసుకుంటాడు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాత్రం ఎక్కువ టైమ్ వేస్ట్ చెయ్యడు. 

కోర్టులో సరెండర్ అయిపోయినా పోలీసులకి ఇన్‌ఫర్మేషన్ వెళ్తుంది. కోర్ట్ ఫైల్స్ పోలీసులకి చేరినప్పుడు పోలీసులకి ఆ విషయం తెలిసిపోతుంది. డి.జి.పి. ముందు లొంగిపోతే మాత్రం పోలీసులు అది పబ్లిసిటీ స్టంట్ అనుకునే ప్రమాదం ఉంది.


Comments

Popular posts from this blog

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట