చాటని, జల్లెడని హిందీలో ఏమంటారో తెలుగు రాష్ట్రాల బిజెపి నేతలని అడిగితే చాట-బుచికి కామెడీ అవుతుంది

 


నేను సినిమాలు చూసి హిందీ నేర్చుకున్నాను. నా హిందీ మాటలు నేటివ్ హిందీ స్పీకర్‌విలాగే ఉంటాయి. బిజెపివాళ్ళు హిందీ సినిమాలని గానీ సాహిత్యాన్ని గానీ ప్రోత్సహించడం లేదు. వాళ్ళు హిందీ రానివాళ్ళు భారతీయులు కాదు అంటున్నారు. ఆ పార్టీలో ఉన్న దక్షిణ భారతీయ నాయకుల్లో ఎంత మందికి హిందీ వచ్చో నరేంద్ర మోదీని అడిగితే వాళ్ళ చొక్కాలకి ఉన్న రంధ్రాలే బయటపడతాయి. ఛలనీకో కిత్నే కానో హోతే హే, నరేంద్ర మోదీ కీ కమీజ్ కో భీ ఉత్నే కానో హై. జల్లెడకి ఎన్ని చిల్లులో మన తెలుగు రాష్ట్రాల బిజెపి లీడర్లని అడిగినా నాలుక కరుచుకుంటారు. 

నేను ఇన్ని హిందీ సినిమాలు చూసాను కానీ జీలుగు చెట్టుని హిందీలో ఏమంటారో నాకు ఇప్పుడు కూడా తెలియదు. అల్లంని హిందీలో అద్రక్ అంటారు కానీ రైల్వే స్టేషన్‌లో టీ అమ్ముకునే తెలుగువాళ్ళు హిందీ ప్రయాణికుల ముందు అల్లం చాయ్ అని అరవడం, వీళ్ళ అరుపు ఆ ప్రయాణికులకి అర్థం కాకపోవడం చూసాను.

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట