రేప్ విషయంలో తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు ఉండరా?

 నాకు జైలులో కొంత మంది రేప్, పాక్సొ(చిన్న పిల్లలతో సెక్స్) కేస్ నిందితులు పరిచయమయ్యారు. వాళ్ళలో ఒకడు 18 ఏళ్ళ యువకుడు, అతని లవర్ వయసు 19 ఏళ్ళు. అతను తన లవర్‌తో సంభోగం చేస్తోంటే ఆమె తల్లితండ్రులు పట్టుకుని అతని మీద రేప్ కేస్ పెట్టారని అతను అంటున్నాడు. వాళ్ళిద్దరిదీ ఒకే వీధి. అతనికి 10 ఎకరాల భూమి ఉంది, అతని లవర్ కుటుంబానికి 20 ఎకరాల భూమి. ఆమె తండ్రి ఒక రాజకీయ నాయకుడు. రాజకీయ ఒత్తిళ్ళతోనే తన మీద రేప్ కేస్ రెజిస్టర్ చేసారని అతను అంటున్నాడు. బట్టలు చిరగకపోతే రేప్ కేస్ ఋజువు అవ్వదు అని నేను అన్నాను. వీర్యపు మరకల్ని టెస్ట్‌కి పంపించారు అని అతను అన్నాడు. కత్తితోనో, తుపాకీతోనో బెదిరించి రేప్ చేసినట్టైతే బట్టలు చిరగకపోయినా కేస్ ఋజువు అవుతుంది. అతని దగ్గర కత్తి లేదు, తుపాకీ లేదు.

ఇంకొకడు తాను సొంత మరదల్ని తీసుకెళ్ళానని చెపుతున్నాడు, తన మీద రేప్ కేస్ పెట్టారని కూడా అన్నాడు. బాల్యవివాహం కోసం అమ్మాయిని తీసుకెళ్తే కిడ్నాప్ కేస్ ఋజువు అవుతుంది కానీ రేప్ కేస్ ఋజువు అవ్వదు. ఇంకొకడు తన వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకి చిన్న వయసులో పెళ్ళయ్యింది. ఆమె వయసు ఎంతో తెలుసుకోకుండా ఆమెతో ఆ పని చేసాడు, పాక్సొ(చిన్న పిల్లలతో సెక్స్) కేసులో ఇరుక్కున్నాడు. అక్రమ సంబంధం వేరు, రేప్ వేరు. రేపిస్టులని ఉరితియ్యాలి అని డిమాండ్ చేసేవాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నవాళ్ళని కూడా ఉరితియ్యాలంటారా?

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట