జనంలో జెండర్ సెన్సిటైజేషన్ కలగనంత వరకు మానభంగాలు జరుగుతూనే ఉంటాయి

 ఎంకౌంటర్ల వల్ల మానభంగాలు తగ్గుతాయని నమ్మే గొర్రెల మందని కూడా ఉద్దేశించి ఇది రాస్తున్నాను. ముందు వేరే విషయం చెపుతాను. ఫేస్‌బుక్‌లో డాక్టర్ యడవల్లి రమణ గారు రాసారు "నాగరిక సమాజానికి కావలసినది జెండర్ సెన్సిటైజేషన్, పెళ్ళాం మొగుణ్ణి కొడుతున్నట్టు చూపించే బాపు గారి కార్టూన్లు జెండర్ ఇన్సెన్సిటివ్" అని. నేను ఇలా కామెంట్ చేసాను "రేప్ లాంటి జెండర్ సెన్సిటివ్ నేరాలు లింగ వివక్ష ఉన్న సమాజంలోనే జరుగుతాయి, ఈ రోజుల్లో లింగ వివక్ష లేదు అని నమ్మేవాళ్ళకి జెండర్ సెన్సిటైజేషన్ లేనట్టే" అని. రమణ గారు నవ్వుకున్నారు. ఈ రోజుల్లో లింగ వివక్ష లేదు అనేవాడు ఎవడూ ఆడపిల్లకి ఆస్తిలో వాటా ఇవ్వడు, కట్నం ఇచ్చి ఆమెని తన కంటే ధనవంతుడికి ఇచ్చి పెళ్ళి చెయ్యడానికే ప్రయత్నిస్తాడు.

ఒకప్పుడు నాకు కూడా జెండర్ సెన్సిటైజేషన్ లేదు. ఆడపిల్లని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామనేది కోమటోళ్ళు. కోమటోళ్ళలో ఫీమేల్ సెక్స్ రేషియో తక్కువ, ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ కూడా తక్కువ. వ్యవసాయం చేసేవాళ్ళకి ఆ సమస్య ఉండదు కానీ వ్యవసాయం చేసేవాళ్ళకి పెళ్ళి సంబంధాలు దొరకవు అని ఈనాడు పత్రికలో రాస్తే నేను కూడా నమ్మేసాను. ఈనాడులో రాసినది తప్పు అని ఒక పల్లెటూరి కాపువాడు చెపితే నాకు అర్థమైంది. ఇండియాలో కుల వ్యవస్థ బలంగానే ఉంది కానీ కోమటోళ్ళు, బాపనోళ్ళ కంటే ప్రభుత్వ ఉద్యోగులే ధనవంతులు. ఈ విషయం కొంత మంది అభ్యుదయవాదులకి తెలియదు. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పెంచడం వల్ల ఫిజికల్ లేబర్‌కి, మెంటల్ లేబర్‌కి మధ్య వైరుధ్యం తగ్గదు అనే నిజం ఫేస్‌బుక్‌లో రాసినందుకు విప్లవ కవి శివసాగర్ గారి మేనకోడలు నన్ను బ్లాక్ చేసింది. ఆమె ప్రభుత్వ ఉద్యోగుల కంటే ధనవంతురాలైన ఎన్.ఆర్.ఐ.. ప్రభుత్వ ఉద్యోగుల్లో కంటే ఎన్.ఆర్.ఐ.లలోనే వరకట్న దురాచారం ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగులు కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాలు పోవాలని కోరుకుంటారంటేనే మనం నమ్మలేము. ఎన్.ఆర్.ఐ.లు అవి పోవాలని కోరుకుంటారంటే ఎలా నమ్ముతాము?

టాపిక్ ఎక్కడికో డైవర్ట్ చెయ్యకుండా డైరెక్ట్‌గా చెపుతాను. స్త్రీలని కించపరిచే సామెతలు "మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కింది, చేతికి గాజులు తొడుక్కున్నాడు" లాంటివి ఇప్పుడు కూడా ఉన్నాయి. స్త్రీ పురుషుని కంటే శారీరకంగా బలహీనురాలు అనే అభిప్రాయం ఉన్నంత వరకు మానభంగాలు జరగవా? మానభంగానికి సాక్ష్యం మాయం చెయ్యడానికి పెట్రోల్ పోసి కాల్చెయ్యడం కూడా జరగదా? లింగ వివక్షని తగ్గించి మానభంగాలు తగ్గించాలనుకోవడం వేరు, రేపిస్ట్‌లని బూటకపు ఎంకౌంటర్లలో చంపి మానభంగాలు తగ్గించాలనుకోవడం వేరు.


Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట