బూటకపు ఎంకౌంటర్లని సమర్థించేవాళ్ళకి జైలు కూడు ఎలా ఉంటుందో తెలియదు

 జైలులో ఎక్కడా డీసెంట్ ఫుడ్ దొరకదు

జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారు అని చెప్పి బూటకపు ఎంకౌంటర్లని చట్టబద్దం చెయ్యాలనుకునేవాళ్ళకి జైలు కూడు ఎలా ఉంటుందో తెలియదు. పాత కేసులో వాయిదాలకి హాజరు అవ్వలేదని నన్ను ఐదు రోజులు రాయగడ సబ్-జైల్‌లో పెట్టారు. ఆ జైలులో ఉదయం పూట ఉప్మా, మధ్యాహ్నం & సాయింత్రం అన్నం ఇస్తారు. జైల్ కేంటీన్ కాంట్రాక్టర్ రూపాయి బియ్యాన్ని బ్లాక్‌లో కొని వండిన అన్నం అది. రూపాయి బియ్యాన్ని కుక్కలు కూడా తినవు అని మాకు తెలిసిన ఒక రిక్షావాడు అనేవాడు. అదే బియ్యాన్ని జైలు కేంటీన్ కాంట్రాక్టర్లు కొని కైదీలకి వండి పెడతారు, హాస్టల్ కేంటీన్ కాంట్రాక్టర్లు కొని విద్యార్థులకి పెడతారు. మా నాన్నగారిది రాయగడ జిల్లా శేసిఖల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపలగూడ గ్రామం. ఈ ఊరిలోని లబ్దిదారులు అమ్ముకునే రేషన్ బియ్యాన్ని కొనే స్మగ్లర్లు దాన్ని బరంపురం, భుబనేశ్వర్ జైల్‌ల కేంటీన్‌లకి కూడా సప్లై చేస్తారు. ఈ ఊరిలో ఎక్కువ మంది కూలీవాళ్ళు, ఇక్కడ 40 మందికి మాత్రమే సొంత వ్యవసాయ భూమి ఉంది. రూపాయి బియ్యాన్ని కూలీవాడు కూడా తినడు కానీ జైల్ కేంటీన్‌లో, హాస్టల్ కేంటీన్‌లో దానితో వండిన అన్నమే దొరుకుతుంది.

జైలులో వండే చేపలు పంది మాంసం కంటే పరిశుభ్రంగా ఉండవు. మనం ఇంటిలో చేపల్ని వాసన పోయేంత వరకు కడుగుతాం. జైల్ కేంటీన్ కాంట్రాక్టర్ చేపల్ని అలా కడగడు. చేపలు కడగడానికి లేబర్ టైమ్ ఎక్కువ పడుతుంది. మనం ఇంటిలో చేపల్ని ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వేసి వండుతాం. జైలు కేంటీం కాంట్రాక్టర్ చేపల్ని నూనెలో ముంచి వేపుతాడు, వేస్ట్ నూనెని పప్పులో కలుపుతాడు. కైదీలని తిండి, స్నానం టైమ్‌లో సెల్ బయటకి వదులుతారు, రాత్రి పూట ఎట్టి పరిస్థితిలోనూ సెల్ బయటకి వదలరు. పప్పు తినడం చాలా కష్టంగా ఉండడం వల్ల జైలులో రెండు సార్లు నేను అన్నం తినను అని చెప్పాను. సాయింత్రం ఆరు గంటలకే సెల్‌కి తాళాలు వేసేస్తారు అని చెప్పి వేరే కైదీలు నన్ను అన్నం తినమని బలవంతం చేసారు. రెండు నెలలు జైలులో ఉండిన కైదీకి పప్పు క్వాలిటీ గురించి అడిగితే వేస్ట్ నూనెని పప్పులో కలిపేస్తారని చెప్పాడు.

జైలు కూడు తినడానికి మెంటలోడికి కూడా ఇష్టం ఉండదు. దళితవాడల్లో నివసించేవాళ్ళు కూడా ఆవు మాంసాన్ని రెండు సార్లు కడుగుతారు, చేపల్ని వాసన పోయేంత వరకు కడుగుతారు. దళితవాడలో నివసించేవాడు కూడా వారానికొకసారి మాంసం, చేపలు తినడానికి జైలుకి వెళ్ళాలనుకోడు. బెయిల్ కోసం సరెండర్ అయ్యేవాళ్ళు పచ్చడి సీసాలని తెచ్చుకుని అన్నంలో పచ్చడి కలుపుకుని తింటారు. కొంత మంది కైదీలు కుటుంబ సభ్యుల చేత టిఫిన్, పండ్లు తెప్పించుకుంటారు. బిర్యానీలని మాత్రం జైలులో అనుమతించరు. ఒడిశా జైల్‌లలో వేసవిలో మాత్రమే చల్లని నీరు ఇస్తారు. బెయిల్ కోసం సరెండర్ అయ్యేవాళ్ళు మినరల్ వాటర్ లేదా కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటారు. జైలులో కొన్ని గంటలు మాత్రమే మోటర్ ఆన్ చేసి ఉంటుంది. మోటర్ ఆన్‌లో ఉన్నప్పుడే కైదీలు ఖాళీ బోతల్స్‌లో నీరు నింపుకుని సెల్స్‌కి తాళం వేసిన టైమ్‌లో తాగుతారు. తిండికీ, నీరుకీ బయట ఉన్నంత స్వేచ్ఛ జైలులో ఉండదు. పెద్దపెద్ద హొటెల్‌వాడే చవక రకం పామాయిల్‌ని బిర్యానీలో కలుపుతాడు. జైల్ కేంటీన్‌వాడు అసలు బిర్యానీ వండడు. పశువుల ఎముకలతో కల్తీ చేసిన నూనెతో బిర్యానీ వండినా ఖర్చు ఎక్కువ అవుతుంది. అంత ఖర్చు పెట్టి కైదీలని మేపాలని ఎవడూ అనుకోడు.

 ఒక రాజకీయ నాయకుడి పెద్దకర్మ రోజు చేపలు వేపిన నూనెలో వంకాయలు వేపడం నేను కళ్ళతో చూసాను. మతపరమైన కార్యక్రమాల్లో వంటలు చేసేవాళ్ళు అమంగళదాయకమైన ఆహారం వండుతున్నప్పుడు జైల్ కేంటీన్ కాంట్రాక్టర్ మాత్రం మంగళదాయకమైన కూడు వండుతాడా? మతపరమైన కార్యక్రమాల్లో వంటలు చేసేవాళ్ళు వేస్ట్ నూనెలో వేపిన వంకాయల్ని పెరుగులో కలిపి అవి పెరుగు వంకాయలు అని చెప్పి అతిథులకి పెడతారు. జైల్ కేంటీన్‌వాడు వేస్ట్ నూనెని డైరెక్ట్‌గా పప్పులో కలిపేస్తాడు. సబ్-జైల్ కైదీలు బెయిల్ మీద బయటకి వెళ్ళిపోవాలనుకుంటారు తప్ప ఫుడ్ క్వాలిటీ మీద కంప్లెయింట్ ఇవ్వరు. జైళ్ళ శాఖ ఐ.జి. తక్కువ బిల్ కోట్ చేసినవాడికే కాంటీన్ కాంట్రాక్ట్ ఇస్తాడు. తక్కువ బిల్ క్లెయిం చేసేవాడు చీప్ క్వాలిటీ ఫుడ్‌నే వండుతాడు కనుక దాని గురించి కంప్లెయింట్ ఇచ్చినా లాభం ఉండదు. జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారు అని మిస్లీడింగ్ ప్రోపగాండా చెయ్యకూడదు. సమాజం గురించి తెలియని అమాయకుడు అది నిజమని నమ్మేసి ఫ్రీ ఫుడ్ కోసం దొంగతనమో, మానభంగమో చేస్తే వాడికి జైలులో ఇన్‌డీసెంట్ ఫుడ్ దొరుకుతుంది. కట్నం కోసం మానభంగం జరిగిన స్త్రీని పెళ్ళి చేసుకునేవాళ్ళు ఉంటారు. రేప్ అనేది నాన్ బెయిలెబుల్ కేస్ కనుక మానభంగం చేసినవాడి జీవితమే చెరసాలలో నాశనం అవుతుంది. హత్య, గంజాయి, మానభంగం, చిన్నపిల్లతో సెక్స్ వగైరా ఇవి నాన్ బెయిలెబుల్ కేసులు, రెండు నెలలు జైలులో ఉండిన కైదీ నాకు ఈ విషయం చెప్పాడు.

 నేరాలు తగ్గాలంటే చట్టం ముందు సమానత్వం కూడా ముఖ్యం. NDPS అనేది నాన్ బెయిలెబుల్ కేస్ అయినప్పటికీ షారూఖ్ ఖాన్ కొడుక్కి బెయిల్ తొందరగా వచ్చింది. సినిమా హీరో కొడుకు రేప్ చేసినా అతనికి బెయిల్ తొందరగా రాదని గ్యారంటీ ఏమిటి? దిశ రేప్ కేసులోని నిందితులు లారీ డ్రైవర్లు & హెల్పర్లు కాబట్టి వాళ్ళు ఫేక్ ఎంకౌంటర్‌కి బలి అయ్యారు కానీ చిరంజీవి కొడుకు రేప్ చేస్తే అతన్ని ఫేక్ ఎంకౌంటర్‌లో చంపాలని డిమాండ్ చేసే ధైర్యం మన సోషల్ మీడియాలోని స్త్రీ జనోద్ధారకులకి ఉండదు. చిరంజీవి గారి తమ్ముడి మీద ఒక అమ్మాయి బైగమీ కేస్ వేస్తే చిరంజీవి గారి అభిమానులే ఆ అమ్మాయిని కొట్టడానికి ప్రయత్నించారు. చిరంజీవి గారి కొడుకు మీద ఒక అమ్మాయి రేప్ కేస్ పెట్టినా ఇలాగే జరుగుతుంది. కొంత మంది రేపిస్టులకి మరణ శిక్ష విధించాలంటున్నస్రు. రేపిస్టులకి మరణ శిక్ష విధిస్తే స్త్రీకి శీలం ప్రాణంతో సమానం అనే అభిప్రాయం కలుగుతుంది, అప్పుడు స్త్రీ-పురుష సంబంధాల విషయంలో మూఢనమ్మకాలు పెరుగుతాయి. భర్త చనిపోయిన స్త్రీకి మాసిన చీర కట్టించి ఇంటిలో పని మనిషిగా పెట్టుకునే సాంఘిక దురాచారస్న్ని దాటి ఆమె చేత డాక్టర్ ఉద్యోగమో, టీచర్ ఉద్యోగమో చెయ్యించే స్థితికి వచ్చాం. ఈ స్థితిలో స్త్రీకి శీలం ప్రాణంతో సమానం లాంటి మూఢనమ్మకాలు తెచ్చుకోవడం అవసరమా? 

రాయగడ సబ్-జెయిల్‌లోని కైదీలలో ఎక్కువ మంది దొంగతనం, NDPS, POCSO కేసుల్లో వచ్చినవాళ్ళు. ఇవి నాన్ బెయిలెబుల్ కేసులు కాబట్టి వీళ్ళకి బెయిల్ తొందరగా దొరకదు. హత్య కేసులో జీవిత కారాగార శిక్ష పడుతుంది కాబట్టి ఇక్కడ హత్య కేస్ నిందితులు తక్కువ. 498a కేస్ నిందితుల్లో కొంత మంది తాగుబోతులు. వాళ్ళు రెక్టిఫైడ్ స్పిరిట్‌తో కల్తీ చేసిన సారా తాగితే వాళ్ళు ఎప్పటికైనా చస్తారు. రేప్, POCSO, 498a అనేవి జెండర్ సెన్సిటివ్ నేరాల కేసులు. లింగ వివక్షని తగ్గించి ఆ కేసులు తగ్గించడానికి ప్రయత్నించాలి. పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రంలాగ అన్నిటికీ ఎంకౌంటర్లు, మరణ శిక్షలు పరిష్కారం కాదు. డబ్బున్నవాడు ఐదు లక్షలు ఎంబెజల్ చేస్తే వదిలేసి ఐదు వేలు దొంగతనం చేసిన పేదవాణ్ణి అరెస్ట్ చేస్తే క్రైమ్ రేట్ తగ్గదు అని ఒక IPS ఆఫీసరే నాకు చెప్పాడు. డబ్బున్నవాడు మర్డర్ చేసినా సాక్ష్యం మాయం చేసే ఆఫీసర్లు ఉన్నారు మన దేశంలో.

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట