మద్యం తాగడానికి అవసరం లేని లైసెన్స్ తుపాకీ కొనడానికి అవసరమా?

 మద్యం తాగిన మత్తులో మానభంగం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి కానీ తుపాకీతో బెదిరించి మానభంగం చేసిన ఘటనలు తక్కువ. విచిత్రం ఏమిటంటే మద్యం తాగడానికి లైసెన్స్ అవసరం లేదు కానీ తుపాకీ కొనడానికి లైసెన్స్ అవసరం. తుపాకీ కొన్న తరువాత దాన్ని డి.ఎస్.పి.కి చూపించాలి. డి.ఎస్.పి. దాని రంధ్రం డయామీటర్, బారెల్ పొడవు కొలుస్తాడు. ఆ తుపాకీ ఎండార్స్ అవ్వకపోతే దాన్ని పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చెయ్యాలి. మద్యం కొనడానికి లైసెన్స్ అవసరం లేదు, అది తాగడానికి ఎండార్స్‌మెంట్ అవసరం లేదు. ఆ మద్యాన్ని రెక్టిఫైడ్ స్పిరిట్‌తో కల్తీ చేసినా, అమ్మోనియాతో కల్తీ చేసినా ఎవరి ఎండార్స్‌మెంట్ లేకుండా అది తాగెయ్యవచ్చు. అమ్మోనియాతో కల్తీ చేసిన మద్యం మూడు గ్లాసులు తాగితే నిశా అవుతుంది. బాటెరీ నుంచి తీసిన కెమికల్స్‌తో కల్తీ చేసిన్స్ మద్యం ఒక్క గ్లాస్ తాగినా నిశా అవుతుంది. ఒడిశా పోలీసులు సారా వ్యాపారుల దగ్గర నెలకి రెండు వేలు చొప్పున మామూళ్ళు వసూలు చేస్తారు. లైసెన్స్ లేని తుపాకులు తయారు చేసేవాళ్ళ దగ్గర మాత్రం అలా మామూళ్ళు తీసుకోరు. తాగుబోతులు పట్టపగకు సారా తాగగలరు కానీ వేటగాళ్ళు రాత్రి పూటే లైసెన్స్ లేని తుపాకులు పట్టుకుని తిరుగుతుంటారు. తాగిన మత్తులో మానభంగం పోలీస్ ఆఫీసర్ కూడా చెయ్యగలడు. మద్యం తాగడానికి లేని లైసెన్స్ మేండేటరీ తుపాకీ కొనడానికి ఎందుకు పెట్టినట్టు?

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట