ఒక ఘటన తమ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగలేదు అని పోలీసులు చెపితే ఏమి చెయ్యాలి?

రెండు పోలీస్ స్టేషన్ల సరిహద్దులో నేరం జరిగితే అరెస్ట్ చేసే అధికారం రెండు స్టేషన్ల ఆఫీసర్లకీ ఉంటుంది. నాకు తెలిసిన ఒక ఆంధ్ర సారా వ్యాపారిని ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. అతని భట్టీ ఒడిశా సరిహద్దులో ఉంది, పాక ఆంధ్రలో ఉంది. ఒడిశా అధికారులు అతని భట్టీని ధ్వంసం చేసి ఆంధ్రలో ఉన్న అతని పాకకి వచ్చి అరెస్ట్ చేసారు. కిడ్నాప్, రేప్ లాంటివి జరిగినప్పుడు మాత్రం ఘటన స్థలం తమ పోలీస్ స్టేషన్ పరిధిలో లేదని చెప్పి పోలీసులు తప్పించుకుంటారు, ఎఫ్.ఐ.ఆర్. రాస్తే ఇవెస్టిగేట్ చెయ్యాల్సివస్తుందని బద్దకించడం వల్ల. పోలీసులు అలా చేస్తే ఎస్.పి. ఆఫీస్‌లో పబ్లిక్ గ్రీవెన్స్ ఇవ్వాలి. ఒక ఘటన వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందనిపిస్తే ఎఫ్.ఐ.ఆర్.ని ఆ పోలీస్ స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ చెయ్యాలి. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ తరువాతే ట్రాన్స్‌ఫర్ చెయ్యాలి కనుక పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. రాయకుండా కుంటి సాకులు చెపుతారు. రైల్వే పోలీసులు ఎక్కువగా జీరో ఎఫ్.ఐ.ఆర్.లు రాస్తారు. కదులుతున్న ట్రెయిన్ ఏ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నప్పుడు నేరం జరిగిందో తెలుసుకుని ఆ రైల్వే పోలీస్ స్టేషన్‌కి దాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. జిల్లా పోలీసులు కూడా ఆ పని చెయ్యొచ్చు కానీ అలా చెయ్యడానికి వాళ్ళకి ఒళ్ళు వంగదు.

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట