జాతకాలు చెప్పుకుని బతికిన సైంటిస్ట్ - టైకో బ్రాహి

 జ్యోతిషం వేరు, ఖగోళ శాస్త్రం వేరు. ఒకప్పుడు సైంటిస్టులు కూడా జ్యోతిషాన్ని నమ్మేవాళ్ళు, కొంత మంది సైంటిస్టులు జాతకాలు చెప్పుకుని బతికేవాళ్ళు కూడా. అలాంటివాళ్ళలో ఒకడు టైకో బ్రాహి.

సూర్య గ్రహణం ప్రతి 177 రోజులు 4 గంటలకి ఒకసారి జరుగుతుంది. కొన్ని సార్లు సంవత్సరానికి ఐదు సూర్య గ్రహణాలు జరుగుతాయి కానీ అలాంటి సంవత్సరాలు గత ఐదు వేల సంవత్సరాల కాలంలో 25 మాత్రమే. ప్రతి గ్రహణం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. జ్యోతిషులు వేరే దేశాల్లో కనిపించిన గ్రహణాల రెకార్డులు సంపాదించి గ్రహణాలు ఎప్పుడొస్తాయో చెప్పగలుగుతుంటారు. ఈ విషయం తెలియక జనం జ్యోతిషులని అపర మేధావులు అనుకుంటారు.

గ్రహణాలు చూడకూడదని మనం నమ్ముతాము కానీ జ్యోతిషులు గ్రహణాలు చూస్తారు. ఒక రోజు టైకో బ్రాహి సూర్య గ్రహణం చూస్తున్నప్పుడు గ్రహణాలు సైక్లికల్‌గా జరుగుతుంటాయని అతనికి డౌట్ వచ్చింది. అతను వేరే దేశాల్లో కనిపించిన గ్రహణాల రెకార్డుల్ని సంపాదించి గ్రహణాలు ఎప్పుడు వస్తాయో చెప్పడం మొదలుపెట్టాడు. ఒక రోజు అతను తురక చక్రవర్తి సులేమాన్ చంద్ర గ్రహణం రోజు చస్తాడని జాతకం చెప్పాడు. అప్పట్లో యూరోపియన్ రాజులకీ, తురక సామ్రాజ్యవాదులకీ మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. యూరోపియన్ రాజులకి ఆ చక్రవర్తి చావే కావాలి. అనుకోకుండా ఆ చక్రవర్తి చంద్ర గ్రహణం రోజు చచ్చాడు. టైకో బ్రాహి యూరోప్‌లో పెద్ద జ్యోతిషుడు అయ్యాడు.

టైకో బ్రాహి మూఢనమ్మకాలని ప్రోత్సహించి బతికినప్పటికీ ఆయన కొన్ని మంచి పనులు చేసాడు. కాసియోపేయా (శర్మిస్ఠా) నక్షత్ర మండలంలో జరిగిన సూపర్నోవా (నక్షత్రం పేలిపోవడం)ని ఆయన 8 నెలలు పాటు గమనించాడు.

Comments

  1. "జ్యోతిషులు వేరే దేశాల్లో కనిపించిన గ్రహణాల రెకార్డులు సంపాదించి గ్రహణాలు ఎప్పుడొస్తాయో చెప్పగలుగుతుంటారు. ఈ విషయం తెలియక జనం జ్యోతిషులని అపర మేధావులు అనుకుంటారు."

    ఈఅవగాహన సరైనది కాదు. గ్రహణాలు ఎప్పుడు వచ్చేదీ చెప్పేది పంచాంగకర్తలు కాని జోస్యులు కాదు. గ్రహణాలను గణితం చేసి తెలుసుకుంటారు. తెలిసీతెలియని రాతలు వద్దు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట