Posts

ఆ పని చేస్తే చెరసాల పాలు అవ్వడమే కాదు, ఆస్తి కూడా జప్తు అవుతుంది

 భక్త రామదాసుని చెరసాలలో పెట్టింది అబ్దుల్లాహ్ కుతుబ్‌షాహ్ కానీ అతన్ని వదిలేసింది అబ్దుల్లాహ్ అల్లుడు అబుల్ హసన్ కుతుబ్‌షాహ్. సినిమాలు, నాటకాలలో రామదాసుని చెరసాలలో పెట్టింది, వదిలేసినది ఒకే కుతుబ్‌షాహ్‌గా చూపిస్తారు. రామదాసు మేనమామలు అబుల్ హసన్ కుతుబ్‌షాహ్ దగ్గర మంత్రులుగా పని చేసారు. రామదాసు చెరసాలకి వెళ్ళిన సమయంలో (1668లో) అబ్దుల్లాహ్ రాజుగా ఉండేవాడు. అక్కన్న, మాదన్నలు అబుల్ హసన్‌ని ఒప్పించి రామదాసుని విడిపించి ఉంటారు కానీ అబుల్ హసన్ వ్యక్తిగతంగా ఏమంత గొప్పవాడు కాదు. అతను మద్యం తాగుతూ మదవతులతో పడుకునేవాడు. రాజు అనుమతి లేకుండా రాజు గారి డబ్బులతో గుడి కట్టినందుకు అబ్దుల్లాహ్ రామదాసుని చెరసాలలో పెట్టాడు కానీ అతను గుడిలోని నగలని జప్తు చెయ్యలేదు. రాజు తలుచుకుంటే ఆ పని కష్టం కాదు. అబ్దుల్లాహ్ దయగలవాడు కావడం వల్ల ఆ పని చెయ్యలేదు. రామదాసుని క్షమిస్తే మరి కొంత మంది రాజు గారి డబ్బులు దుర్వినియోగం చేస్తారు కనుక రాజు రామదాసుని చెరసాలలో పెట్టాడు. ఇప్పుడు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ ఎవడైనా ప్రభుత్వ సొమ్ముతో గుడి కడితే అతన్ని అరెస్ట్ చెయ్యడంతో పాటు అతని ఆస్తిని జప్తు చేస్తారు. ఒక వ్యక్తి మీద ఎ.సి.బి...

హిందు స్త్రీ రేప్ విషయంలో అబద్దం చెప్పదా?

 హిందు స్త్రీ రేప్ విషయంలో అబద్దం చెప్పదని నమ్మేవాళ్ళలో కొంత మంది న్యాయమూర్తులు కూడా ఉన్నారు. రేప్‌కి గురైన హిందు స్త్రీకి పెళ్ళి సంబంధం దొరక్కపోవచ్చు కానీ తప్పుడు రేప్ కేస్ పెట్టేవాళ్ళకి ఆ సమస్య రాదు, రేప్ జరగలేదని ఆమె బంధువులకి గానీ ఆమె కులపువాళ్ళకి గానీ తెలిసినట్టైతే. రాయగడ సబ్-జెయిల్‌లో నాకు ఒక రేప్ కేస్ నిందితుడు పరిచయమయ్యాడు. అతను ఒక రాజకీయ నాయకుడి కూతురిని ప్రేమించాడు. అతనికి పదెకరాలు భూమి ఉంది, ఆ అమ్మాయికి ఇరవై ఎకరాలు ఉంది. ఇద్దరిదీ ఒకే కులం, ఒకే వీధి. అతను తన లవర్‌తో సంభోగం చేస్తుండగా ఆమె తల్లితండ్రులు అతన్ని పట్టుకుని ఆమె చేత రేప్ కేస్ పెట్టించారని అతను అన్నాడు. బట్టలు చిరగకపోతే రేప్ కేస్ ఋజువు అవ్వదు అన్నాను. వీర్యాన్ని టెస్ట్‌లకి పంపించారన్నాడు. వీర్యపు మరకలు ఉన్నా బట్టలు చిరగకపోతే రేప్ కేస్ ఋజువు అవ్వదు అన్నాను. అతనిది గౌడ (గోపాళ) కులం. ఆ కులంవాళ్ళ వృత్తి పశువులు మేపడం కానీ ఆ కులంలో 25 ఎకరాలు ఉన్న భూస్వాములు కూడా ఉన్నారు. ఈ అబ్బాయిని వదిలించుకుంటే ఇతని కంటే ఎక్కువ భూమి ఉన్న సంబంధం దొరుకుతుందని అమ్మాయి తల్లితండ్రుల ప్లాన్ కావచ్చు. రేప్ అనేది నాన్ బెయిలెబుల్ కేస్. ఆ కేస్...

సారా వ్యాపారుల్ని ఉద్ధరించడానికి సారా వ్యాపారాన్ని చట్టబద్ధం చెయ్యాలని డిమాండ్ చెయ్యగలరా?

 సారా వ్యాపారం చేసేవాడు పోలీసులకి దొరికిపోతే అతను వేరే వ్యాపారం చూసుకుంటాడు. అలాగే వేశ్యలు పోలీసులకి దొరికిపోతే వాళ్ళు వేరే వ్యాపారం చెయ్యలేరా? స్త్రీ జనోద్ధారకులు వేశ్యావృత్తిని చట్టబద్దం చెయ్యాలంటారు కానీ సారా వ్యాపారాన్ని చట్టబద్దం చెయ్యాలని డిమాండ్ చెయ్యరు. సారా వ్యాపారం చేసేది కూడా పేదవాళ్ళే. సారా వ్యాపారుల్ని ఉద్ధరించడానికి ఎవరూ ప్రయత్నించరు కానీ వేశ్యల్ని ఉద్ధరించడానికి మాత్రం సంఘాలు పుట్టుకొస్తాయి. వేశ్యతో పడుకున్నవాడికి కండోమ్ జారిపోయి గుప్తరోగం అంటితే వాడి చికిత్సకి వీళ్ళు డబ్బులు ఇస్తారా? రెక్టిఫైడ్ స్పిరిట్‌తో కల్తీ చేసిన సారా తాగితే మనిషి ఎక్కువ కాలం బతకడు. అమ్మోనియాతో కల్తీ చేసిన సారా తాగితే ఆకలి తగ్గిపోతుంది. గుప్తరోగం అంత తొందరగా తగ్గదు, మూడు సార్లు గుప్తరోగం అంటినవాడు కూడా ఎంత కాలం బతుకుతాడో తెలియదు. వేశ్యావృత్తిని చట్టబద్ధం చేస్తే వేశ్యలతో పడుకున్నవాళ్ళని ఉద్దరించినట్టు కూడా అవ్వదు.

బూటకపు ఎంకౌంటర్లని సమర్థించేవాళ్ళకి జైలు కూడు ఎలా ఉంటుందో తెలియదు

 జైలులో ఎక్కడా డీసెంట్ ఫుడ్ దొరకదు జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారు అని చెప్పి బూటకపు ఎంకౌంటర్లని చట్టబద్దం చెయ్యాలనుకునేవాళ్ళకి జైలు కూడు ఎలా ఉంటుందో తెలియదు. పాత కేసులో వాయిదాలకి హాజరు అవ్వలేదని నన్ను ఐదు రోజులు రాయగడ సబ్-జైల్‌లో పెట్టారు. ఆ జైలులో ఉదయం పూట ఉప్మా, మధ్యాహ్నం & సాయింత్రం అన్నం ఇస్తారు. జైల్ కేంటీన్ కాంట్రాక్టర్ రూపాయి బియ్యాన్ని బ్లాక్‌లో కొని వండిన అన్నం అది. రూపాయి బియ్యాన్ని కుక్కలు కూడా తినవు అని మాకు తెలిసిన ఒక రిక్షావాడు అనేవాడు. అదే బియ్యాన్ని జైలు కేంటీన్ కాంట్రాక్టర్లు కొని కైదీలకి వండి పెడతారు, హాస్టల్ కేంటీన్ కాంట్రాక్టర్లు కొని విద్యార్థులకి పెడతారు. మా నాన్నగారిది రాయగడ జిల్లా శేసిఖల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపలగూడ గ్రామం. ఈ ఊరిలోని లబ్దిదారులు అమ్ముకునే రేషన్ బియ్యాన్ని కొనే స్మగ్లర్లు దాన్ని బరంపురం, భుబనేశ్వర్ జైల్‌ల కేంటీన్‌లకి కూడా సప్లై చేస్తారు. ఈ ఊరిలో ఎక్కువ మంది కూలీవాళ్ళు, ఇక్కడ 40 మందికి మాత్రమే సొంత వ్యవసాయ భూమి ఉంది. రూపాయి బియ్యాన్ని కూలీవాడు కూడా తినడు కానీ జైల్ కేంటీన్‌లో, హాస్టల్ కేంటీన్‌లో దానితో వండిన అన్నమే దొరుకుతుంది. జైల...

మద్యం తాగడానికి అవసరం లేని లైసెన్స్ తుపాకీ కొనడానికి అవసరమా?

 మద్యం తాగిన మత్తులో మానభంగం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి కానీ తుపాకీతో బెదిరించి మానభంగం చేసిన ఘటనలు తక్కువ. విచిత్రం ఏమిటంటే మద్యం తాగడానికి లైసెన్స్ అవసరం లేదు కానీ తుపాకీ కొనడానికి లైసెన్స్ అవసరం. తుపాకీ కొన్న తరువాత దాన్ని డి.ఎస్.పి.కి చూపించాలి. డి.ఎస్.పి. దాని రంధ్రం డయామీటర్, బారెల్ పొడవు కొలుస్తాడు. ఆ తుపాకీ ఎండార్స్ అవ్వకపోతే దాన్ని పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చెయ్యాలి. మద్యం కొనడానికి లైసెన్స్ అవసరం లేదు, అది తాగడానికి ఎండార్స్‌మెంట్ అవసరం లేదు. ఆ మద్యాన్ని రెక్టిఫైడ్ స్పిరిట్‌తో కల్తీ చేసినా, అమ్మోనియాతో కల్తీ చేసినా ఎవరి ఎండార్స్‌మెంట్ లేకుండా అది తాగెయ్యవచ్చు. అమ్మోనియాతో కల్తీ చేసిన మద్యం మూడు గ్లాసులు తాగితే నిశా అవుతుంది. బాటెరీ నుంచి తీసిన కెమికల్స్‌తో కల్తీ చేసిన్స్ మద్యం ఒక్క గ్లాస్ తాగినా నిశా అవుతుంది. ఒడిశా పోలీసులు సారా వ్యాపారుల దగ్గర నెలకి రెండు వేలు చొప్పున మామూళ్ళు వసూలు చేస్తారు. లైసెన్స్ లేని తుపాకులు తయారు చేసేవాళ్ళ దగ్గర మాత్రం అలా మామూళ్ళు తీసుకోరు. తాగుబోతులు పట్టపగకు సారా తాగగలరు కానీ వేటగాళ్ళు రాత్రి పూటే లైసెన్స్ లేని తుపాకులు పట్టుకుని తిరుగుతుంటా...

జనంలో జెండర్ సెన్సిటైజేషన్ కలగనంత వరకు మానభంగాలు జరుగుతూనే ఉంటాయి

 ఎంకౌంటర్ల వల్ల మానభంగాలు తగ్గుతాయని నమ్మే గొర్రెల మందని కూడా ఉద్దేశించి ఇది రాస్తున్నాను. ముందు వేరే విషయం చెపుతాను. ఫేస్‌బుక్‌లో డాక్టర్ యడవల్లి రమణ గారు రాసారు "నాగరిక సమాజానికి కావలసినది జెండర్ సెన్సిటైజేషన్, పెళ్ళాం మొగుణ్ణి కొడుతున్నట్టు చూపించే బాపు గారి కార్టూన్లు జెండర్ ఇన్సెన్సిటివ్" అని. నేను ఇలా కామెంట్ చేసాను "రేప్ లాంటి జెండర్ సెన్సిటివ్ నేరాలు లింగ వివక్ష ఉన్న సమాజంలోనే జరుగుతాయి, ఈ రోజుల్లో లింగ వివక్ష లేదు అని నమ్మేవాళ్ళకి జెండర్ సెన్సిటైజేషన్ లేనట్టే" అని. రమణ గారు నవ్వుకున్నారు. ఈ రోజుల్లో లింగ వివక్ష లేదు అనేవాడు ఎవడూ ఆడపిల్లకి ఆస్తిలో వాటా ఇవ్వడు, కట్నం ఇచ్చి ఆమెని తన కంటే ధనవంతుడికి ఇచ్చి పెళ్ళి చెయ్యడానికే ప్రయత్నిస్తాడు. ఒకప్పుడు నాకు కూడా జెండర్ సెన్సిటైజేషన్ లేదు. ఆడపిల్లని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామనేది కోమటోళ్ళు. కోమటోళ్ళలో ఫీమేల్ సెక్స్ రేషియో తక్కువ, ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ కూడా తక్కువ. వ్యవసాయం చేసేవాళ్ళకి ఆ సమస్య ఉండదు కానీ వ్యవసాయం చేసేవాళ్ళకి పెళ్ళి సంబంధాలు దొరకవు అని ఈనాడు పత్రికలో రాస్తే నేను కూడా నమ్మేసాను. ఈనాడు...

మన సమాజాన్ని 1815 నాటి రాచరిక భూస్వామ్య వ్యవస్థకి దిగజారుద్దామా?

రేపిస్టులని ఎంకౌంటర్ చెయ్యాలని సోషల్ మీడియాలో ప్రతివాడు అరుస్తాడు. జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారని కూడా వీళ్ళు ఏడుస్తారు. జైలులో కైదీలకి బిర్యానీలు మేపేంత బడ్జెట్ జైళ్ళ శాఖ ఐ.జి.కి ఉండదు అని వీళ్ళకి తెలియదు.   ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో నవలలో ప్రాసిక్యూటర్ ఒక రాజభక్తుడు కానీ అతని తండ్రి రాజద్రోహి నెపోలియన్‌తో సంబంధం పెట్టుకుంటాడు. ఆ రహస్యం బయటపడకూడదని ప్రాసిక్యూటర్ హీరోని విచారణ లేకుండానే శాతో దీఫ్ అనే చీకటి చెరసాలలో కైదు చేస్తాడు. 1815లో ప్రపంచంలోని ఏ దేశంలోనూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదు. అప్పట్లో ప్రాసిక్యూటర్‌కి ఇలాంటి తప్పులు చెయ్యడం సాధ్యమే. రేపిస్టులని విచారణ లేకుండా ఎంకౌంటర్ చేసి మన సమాజాన్ని 1815 నాటి రాచరిక భూస్వామ్య వ్యవస్థకి దిగజారుద్దామా?  ఇండియాలో అదే పరిస్థితి వస్తే ఏమవుతుంది? పిచ్చిదాయి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వదనుకుని ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు పిచ్చిదాన్ని రేప్ చేసాడనుకుందాం. ఆ రేప్‌ని చూసినవాణ్ణి ఆ పోలీస్ ఆఫీసర్ బూటకపు ఎంకౌంటర్లో చంపడని గ్యారంటీ ఏమిటి? ఒక పోలీస్ ఆఫీసర్ తమ్ముడు నక్సల్ లీడర్. ఆ ఆఫీసర్ తన తమ్ముణ్ణి సరెండర్ చెయ్యించలేకపోయాడు. ఈ రహస్యం తెలిస...