ఆ పని చేస్తే చెరసాల పాలు అవ్వడమే కాదు, ఆస్తి కూడా జప్తు అవుతుంది

 భక్త రామదాసుని చెరసాలలో పెట్టింది అబ్దుల్లాహ్ కుతుబ్‌షాహ్ కానీ అతన్ని వదిలేసింది అబ్దుల్లాహ్ అల్లుడు అబుల్ హసన్ కుతుబ్‌షాహ్. సినిమాలు, నాటకాలలో రామదాసుని చెరసాలలో పెట్టింది, వదిలేసినది ఒకే కుతుబ్‌షాహ్‌గా చూపిస్తారు. రామదాసు మేనమామలు అబుల్ హసన్ కుతుబ్‌షాహ్ దగ్గర మంత్రులుగా పని చేసారు. రామదాసు చెరసాలకి వెళ్ళిన సమయంలో (1668లో) అబ్దుల్లాహ్ రాజుగా ఉండేవాడు. అక్కన్న, మాదన్నలు అబుల్ హసన్‌ని ఒప్పించి రామదాసుని విడిపించి ఉంటారు కానీ అబుల్ హసన్ వ్యక్తిగతంగా ఏమంత గొప్పవాడు కాదు. అతను మద్యం తాగుతూ మదవతులతో పడుకునేవాడు. రాజు అనుమతి లేకుండా రాజు గారి డబ్బులతో గుడి కట్టినందుకు అబ్దుల్లాహ్ రామదాసుని చెరసాలలో పెట్టాడు కానీ అతను గుడిలోని నగలని జప్తు చెయ్యలేదు. రాజు తలుచుకుంటే ఆ పని కష్టం కాదు. అబ్దుల్లాహ్ దయగలవాడు కావడం వల్ల ఆ పని చెయ్యలేదు. రామదాసుని క్షమిస్తే మరి కొంత మంది రాజు గారి డబ్బులు దుర్వినియోగం చేస్తారు కనుక రాజు రామదాసుని చెరసాలలో పెట్టాడు.

ఇప్పుడు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ ఎవడైనా ప్రభుత్వ సొమ్ముతో గుడి కడితే అతన్ని అరెస్ట్ చెయ్యడంతో పాటు అతని ఆస్తిని జప్తు చేస్తారు. ఒక వ్యక్తి మీద ఎ.సి.బి. కేస్ రెజిస్టర్ అయితే అతని బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తారు. అతను కోర్టులో నిర్దోషిగా విడుదల అయితేనే అతని బ్యాంక్ అకౌంట్లు రీఏక్టివేట్ చేస్తారు. గుడి కట్టేంతగా డబ్బులు దుర్వినియోగం చేస్తే ఆస్తి జప్తు చెయ్యడం తప్పకుండా జరుగుతుంది.

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట