Posts

Showing posts with the label Dalits

ప్రోపగాండా భాష మాట్లాడితే మిమ్మల్ని తింగరోళ్ళు అనుకుంటారు

జైలులో కైదీని లోపల పెట్టే ముందు జైలు సూపరింటెండెంట్ కైదీకి కులం పేరు అడుగుతాడు. అతను "ఈ రోజుల్లో కులాలు లేవు" అనో, "నేను నాస్తికుణ్ణి కనుక నాకు కులం వర్తించదు" అనో చెపితే అతన్ని తింగరోడు అనుకుంటారు. పెళ్ళి సంబంధం కోసం వెళ్ళినప్పుడు "మీది ఏ కులం?" అని అడుగుతారు తప్ప "మీది ఏ సామాజిక వర్గం?" అని అడగరు. "మాది ఫలానా సామాజిక వర్గం" అని చెప్పుకున్నా విచిత్రంగా చూస్తారు. ప్రోపగాండా భాష మాట్లాడితే ఇలాగే నవ్వులపాలు అవుతాము. నేను జైలులో ఉన్నప్పుడు నేను ఉండిన సెల్‌లో ఒక కోమటోడు, ఒక బాపనోడు ఉండేవారు. ఆ సెల్‌లో ఎక్కువ మంది పేదవాళ్ళు. ఆ బాపనోడు ఆస్తి ఎక్కువ ఉన్నవాడే. అతను పాక్సో కేసులో జైలుకి వచ్చాడు. జైలులో డబ్బున్నవాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు కాబట్టి అతను పంచముల పక్కనే పడుకున్నాడు, వాళ్ళ పక్కనే కూర్చుని తిన్నాడు. జైలు నుంచి విడుదల అయిన తరువాత అతను తన కులంవాళ్ళ ఇంటిలోనే తింటాడు తప్ప పంచముల పక్కన కూర్చుని తినడు. ఇండియాలోని జైళ్ళలో దళితులు & ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంది. వీళ్ళు లాయర్ ఫీజ్ కట్టలేకపోవడం వల్ల వీళ్ళకి బెయిల్ రావడం లేదు. ఈ విషయం జై...

దళితులు అందరు నాస్తికులు, హేతువాదులు, బౌద్ధులా?

దళితులు అందరు నాస్తికులనో, హేతువాదులనో, బౌద్ధులనో నమ్మేవాళ్ళు ఉన్నారు. అలా నమ్మేవాళ్ళలో కొంత మంది నాస్తికులు, కొంత మంది మత విశ్వాసులు. హిందు మతం కుల వ్యవస్థని, లింగ వివక్షని సమర్థించడానికి పుట్టిందని కొంత మంది చదువుకున్నవాళ్ళకి కూడా తెలియదు. దీన్ని అడ్వాంటెజ్‌గా తీసుకునే కొంత మంది ఈ రోజుల్లో కుల వివక్ష, లింగ వివక్ష లేదని వాదిస్తారు. దళిత రిటైర్డ్ ఐ.పి.ఎస్. ఆఫీసర్ పంతులు సమేతంగా పూజలు చెయ్యడంపై కొంత మంది బహుజనవాదులు ఆశ్చర్యపోతున్నారు, కొంత మంది బహుజనవాద వ్యతిరేకులు వెక్కిరిస్తున్నారు. దళితులందరు నాస్తికులు కానప్పుడు ఇక్కడ ఆశ్చర్యపోవడానికో, వెక్కిరించడానికో ఏముంది? హిందు మతం కుల వ్యవస్థని సమర్థించడానికి పుట్టిందని తెలియక మా ఊరిలోనే ఆదివాసులు దసరా జాతర నిర్వహిస్తున్నారు. దీపావళి నాడు మా ఊరిలో పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టేది దళితవీధి వాసులు. రావణుడు తమ తాత అని చెప్పి రావణ దహణాన్ని అడ్డుకుంటాం అనే బహుజనవాదులు దీని గురించి ఏమి చెపుతారు? మా ఊరిలో రెండు వీధులు ఉన్నాయి. ఒకటి ఆదివాసి వీధి, ఒకటి దళిత వీధి. దళితుల కంటే ఆదివాసులకి వ్యవసాయ భూమి ఎక్కువ. ఇక్కడ కొంత మంది ఆదివాసులు దళితుల ఇంటిలో భోజనం చెయ...