Posts

Showing posts with the label Feminism

Never be over confident about the masses

 దళితుల చైతన్యాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తే దళితవాదమే ఓడిపోతుంది. దళితులందరు నాస్తికులనో, హేతువాదులనో, బౌద్ధులనో అర్థం వచ్చేలా కొంత మంది దళితవాదులు, కొంత మంది హిందుత్వవాదులు ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు. దళితుల్లో కూడా రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు హిందు ఆచారమైన కట్నం పాటిస్తున్నారు. రాయగడ జిల్లాలో వరకట్న నిషేధ చట్టం కేసులోని నిందుతుల్లో కొంత మంది దళితులు & ఆదివాసులు. ఇక్కడ ఆదివాసుల్లో వరకట్న ఆచారం లేదు. అయినా పట్టణ ప్రాంతాల్లో స్థిరపడిన ఆదివాసులు కట్నం తీసుకుంటున్నారు. మత గ్రంథాలు చదవని చదువురానివాళ్ళ కంటే అవి చదివిన చదువుకున్నవాళ్ళలో హిందుత్వ భావజాలం ఎక్కువ ఉంటుంది.

ఆడదానికి హిందు మతం మీద నమ్మకం ఉంటే తన భర్త చనిపోయాడని మేట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో రాసి చూసుకోవచ్చు

 రమా సుందరి అనే రచయిత్రి ఉన్నారు. ఆవిడ నాస్తికురాలు కావడం వల్ల బొట్టు పెట్టుకోదు. గుంటూరులోని ఒక అపార్ట్‌మెంట్‌వాళ్ళు ఆవిడని ముస్లిం అనో, విధవ అనో అనుకుని ఇల్లు అద్దెకి ఇవ్వడం కుదరదు అనేసారు. ఈ రోజుల్లో కుల వివక్ష, లింగ వివక్ష లేదు అనే ప్రోపగాండాని కొంత మంది స్త్రీలు కూడా నమ్ముతున్నారు. అలా నమ్మే స్త్రీ పెళ్ళి కానిది అయితే తన భర్త చనిపోయాడని మేట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో రాసి చూసుకోవచ్చు, పెళ్ళైనది అయితే బొట్టు తీసేసి అద్దె ఇంటి కోసం వెతకొచ్చు. ఆ రెండిటిలో ఏది చేసినా ఎంత మంది ఆమె మీద మొహం చాటేస్తారో తెలిసి వస్తుంది. విశాఖపట్నంలో ఒకడు తాను ఎన్.ఆర్.ఐ.నని చెప్పుకుని మేట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్ పెట్టాడు. భర్త చనిపోయిన స్త్రీలు & విడాకులు తీసుకున్న స్త్రీల చేత తన బ్యాంక్ అకౌంట్‌లో పైసలు డిపాజిట్ చెయ్యించుకుని పారిపోయాడు. అతని మీద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేస్ రెజిస్టర్ అయ్యింది. భర్త చనిపోయిన స్త్రీ రెండవ పెళ్ళి చేసుకోవాలనుకుంటే తనకి తెలిసిన వ్యక్తినే కాంటాక్ట్ చెయ్యొచ్చు. బ్లాగులు & ఫేస్‌బుక్‌లో స్త్రీవాదం కబుర్లు చెప్పేవాడు కూడా భర్త చనిపోయిన స్త్రీని పెళ్ళి చేసుకోడ...

హిజ్రా వృత్తి గురించి నేను షేర్ చేసిన లింక్‌ని డిలీట్ చేసిన ఫేస్‌బుక్

హిజ్రా వృత్తిని హిజ్రాలు వదులుకుంటే హిజ్రా అనే పదం వాడాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. హిజ్రా అనే పదాన్ని నిషేధించడం వల్ల ఆ వృత్తి పోదు. ఈ నిజం రాసినందుకు ఫేస్‌బుక్ నేను షేర్ చేసిన లింకులని డిలీట్ చేసింది. ఉత్తర భారత దేశంలో వాల్మీకీ కులస్తులు పాకీ వృత్తి నుంచి బయటకి రావాలనుకుంటున్నారు. వాళ్ళు ఆ వృత్తిని వదిలేస్తే అగ్రకులాలవాళ్ళు తమ లెట్రిన్లు తామే కడుక్కోవాల్సి వస్తుందని వాళ్ళు ఆ వృత్తిని వదలకుండా అగ్రకులాలవాళ్ళు అడ్డు తగులుతున్నారు. మనవాళ్ళకి సమాజం మారడం ఇష్టం లేదు కానీ పదాలని నిషేధించడం మీద ఎక్కడా లేని ఆసక్తి ఉంది. కోర్టు పాకీ అనే పదాన్ని నిషేధిస్తుంది, సఫాయీ కర్మచారీ అనే పదాన్ని వాడాలంటుంది, కానీ పాకీ వృత్తి నుంచి బయటకి రావాలనుకునేవాళ్ళని మనవాళ్ళు బయటకి రానివ్వరు.

దళితవాదులకి ఉన్న కామన్ సెన్స్ స్త్రీవాదులకి లేదా?

 ఆ మధ్య కలేకూరి ప్రసాద్ గారు "ఆంధ్ర ప్రదేశ్ దళితులు" అనే పుస్తకం రాసారు. కొంత మంది "ఈ రోజుల్లో కుల వివక్ష లేదు" అని చెప్పి రిజర్వేషన్‌ని రద్దు చెయ్యాలంటున్నారు, ఆట్రోసిటీ చట్టాన్ని కూడా రద్దు చెయ్యాలంటున్నారు. అలాంటివాళ్ళని కౌంటర్ చెయ్యడానికి కలేకూరి ప్రసాద్ గారు ఆ పుస్తకం రాసారు. మరి "ఈ రోజుల్లో లింగ వివక్ష లేదు" అని చెప్పి ఐ.పి.సి. 498ఎ ని రద్దు చెయ్యించాలనుకునేవాళ్ళ మీద స్త్రీవాదులకి ఇంత వ్యతిరేకత ఉందా? మా చిన్నప్పుడు స్వాతి అనే ఒక సపరివార బూతు పత్రికలో రాసేవాళ్ళు "ఈ రోజుల్లో లింగ వివక్ష లేదట! జనం సెక్స్ గురించి ఫ్రీగా మాట్లాడుకుంటున్నారట!" ఇది నిజం అని నమ్మి ఎవరైనా సెక్స్ గురించి మాట్లాడితే అతన్ని చెప్పుతో కొట్టేవాళ్ళు. ఆడవాళ్ళు మాత్రమే కాదు, మగవాళ్ళు కూడా అలా కొడతారు. ఇలాంటి తప్పుడు ప్రోపగాండా చేసిన వేమూరి బలరాం మీద ఒక్క స్త్రీవాదికి కూడా కోపం లేదు. వేశ్యల దగ్గరకి వెళ్ళడం తప్పు కానీ ఎయిడ్స్ గురించి మాట్లాడడం తప్పు కాదు. నేను ఎయిడ్స్ గురించి మాట్లాడితేనే "నిన్ను ఎవరు అడిగారు" అని నన్ను తిట్టినవాళ్ళు ఉన్నారు. మనం నిజంగా సెక్స్ గురించ...