అది తెలంగాణ సినిమా అయితే ఎలాంటి మూఢనమ్మకాల్ని ప్రోత్సహించినా పర్వాలేదా?

 

 
పెన్మెత్స సుబ్బరాజు గారి ఈ పోస్ట్ చదివిన తెలంగాణ జనం ఆంధ్ర హేతువాదులు తెలంగాణ సినిమాపై విషం కక్కుతున్నారని ఏడుస్తున్నారు. ఆత్మలు కాకుల్లో దూరి పిండాలు తింటాయని నమ్మేవాళ్ళు ఆంధ్రలో కూడా ఉన్నారు. కేవలం ఒక తెలంగాణ సినిమాపై విషం కక్కాల్సిన అవసరం సుబ్బరాజు గారికి లేదు. మా ఒడిశాలో తాగుబోతు చస్తే అతని సమాధిలో సారా పేకెట్లు పాతుతారు. ఆత్మ పిండాల్ని తింటుందని ఆంధ్ర & తెలంగాణల్లో ఎలా నమ్ముతారో, ఆత్మ సారా తాగుతుందని ఒడిశా జనం అలాగే నమ్ముతారు. నేను మా ఒడిశా సంస్కృతి పేరుతో ఇక్కడి నమ్మకాలకి వ్యతిరేకంగా మాట్లాడకుండా నోరు మూసుకోలేదే.

Comments

Popular posts from this blog

ఇందిరా గాంధీ వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోవడం BJP అభిమానులకి అవసరమా?

శంకర్ దాదాలు IAS, IPS అధికారులైతే ఏమవుతుంది?

మన సమాజాన్ని 1815 నాటి రాచరిక భూస్వామ్య వ్యవస్థకి దిగజారుద్దామా?