పెళ్ళిలో బ్రాహ్మణుల వండింది తిని దళితుల పాకలో మద్యం తాగుతారు

కొంత మంది పెళ్ళి భోజనాలలో బ్రాహ్మణుల చేతే వంట చెయ్యిస్తారు. బ్రాహ్మణులు పరిశుభ్రంగా వండుతారని వాళ్ళ నమ్మకం. బ్రాహ్మణులు నడిపే హొటెల్స్‌లో కూడా లూజ్ పామాయిల్‌తో వంట చేస్తారు తప్ప రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ వాడరు. ఒడియా, బెంగాలీ, కశ్మీరీ, కోంకణీ & కేరళ బ్రాహ్మణులు మాంసం తింటారు. ఒడిశాలోని రాయగడ పట్టణంలో పెళ్ళి భోజనాల్లో వంటలు చేసేవాళ్ళలో ఎక్కువ మంది బ్రాహ్మణులు. వాళ్ళు పెళ్ళి భోజనాల్లో మాంసం వండుతారు కానీ అన్‌హెల్దీ కండిషన్‌లో. మనం ఇంటిలో చేపల్ని ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి మధ్య ఉడకబెడతాం. పెళ్ళి భోజనాల్లో వంటలు చేసేవాళ్ళు చేపల్ని నూనెలో ముంచి వేపుతారు, వేస్ట్ నూనెని వంకాయల్లో కలుపుతారు. ఆ వంకాయల్ని పెరుగులో ముంచి అవి పెరుగువంకాయలని చెప్పి అతిథులకి పెడతారు. జైల్ కీంటీన్ కాంట్రాక్టర్లు, హాస్టల్ కేంటీన్ కాంట్రాక్టర్లు వేస్ట్ నూనెని పప్పులో కలుపుతారు. కైదీలకీ, విద్యార్థులకీ వేరే దారి దొరక్క ఆ ఫుడ్ తింటారు.

పంచముడు వండిన ఆహారం తినకూడదు అని మనం అనుకుంటాము కానీ పంచముడి కుటీరంలో మద్యం తాగేటప్పుడు అలాంటి పట్టింపులు అడ్డురావు. మా పక్క గ్రామంలోనే సొంత వ్యవసాయ భూమి ఉన్న కులంవాళ్ళు భూమి లేని పంచముల కుటీరాల్లో మద్యం తాగడం కళ్ళతో చూసాను. సారా పాకవాడు గ్లాసులు సరిగ్గా కడగడు. అయినా వాడి పాకలో జెనెరల్ కేటగరీవాళ్ళు మద్యం తాగేస్తారు. పెళ్ళి విషయానికి వచ్చేటప్పుడు బ్రాహ్మణ వంటగాళ్ళని పిలుస్తారు తప్ప పంచమ వంటగాళ్ళని పిలవరు. 

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట