మశూచి ఉన్నవాడికే అవసరం లేని ఎసి మామూలు చర్మ రోగం ఉన్నవాడికి అవసరమా?

 కైదీకి మశూచి లేదా ప్లేగ్ లాంటి భయంకరమైన రోగం వస్తే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని అంటు రోగాల వార్డ్‌కి పంపించేస్తారు తప్ప ఎసి రూమ్‌లో పెట్టరు. చంద్రబాబు నాయుడికి వచ్చింది మామూలు చర్మ రోగం. దాని కోసం అతనికి అత్తవారి ఇంటిలాగ ఎసి పెట్టడం అవసరమా? చట్టం ముందు అందరు సమానం కాదని బాగానే నిరూపించారు.

ఒడిశా జైల్‌లలో ఒకప్పుడు కైదీలకి ఉప్పుడు బియ్యంతో చేసిన ఇచ్చేవాళ్ళు. ఉప్పుడు బియ్యపు అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినగలం. బియ్యం రేట్ బాగా పెరిగిన తరువాత జైల్ కేంటీన్ కంట్రాక్టర్లు రూపాయి బియ్యం బ్లాక్‌లో కొని వండి కైదీలకి పెట్టడం మొదలు పెట్టారు. మా ఊరిలో లబ్దిదారులు బ్లాక్‌లో అమ్ముకునే బియ్యం బ్రహ్మపురం సెంట్రల్ జైల్‌కి కూడా వెళ్తుంది. నా పొలంలో పని చేసే ట్రాక్టర్ డ్రైవరే ఊరివాళ్ళ దగ్గర బ్లాక్‌లో బియ్యం కొని పక్క ఊరి సాహుకార్లకి ఇస్తాడు, ఆ సాహుకార్లు ఆ బియ్యాన్ని జైల్ కేంటీన్లకి, హాస్టల్ కేంటీన్లకి సప్లై చేస్తారు. జైలులోని కైదీలందరు రూపాయి బియ్యం తినాలి, ఒక మాజీ ముఖ్య మంత్రి మాత్రం ఇంటిలో వండిన ఆహారం జైలుకి తెప్పించుకోవాలి అన్నప్పుడే చట్టం ముందు సమానత్వం మీద డౌట్ రాలేదా?

Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట