రిజర్వేషన్ పేరుతో జనాన్ని ఫూల్ చేస్తున్న ప్రభుత్వం

 రిజర్వేషన్ కులాల్లో చదువుకున్నవాళ్ళు తక్కువ. నేను ఉండే రాయగడ జిల్లాలోనే బి.సి. కోటాలో టీచర్ పోస్టులు ఖాళీ మిగిలిపోతున్నాయి. ఒడిశాలో ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వాలంటే +2(12th క్లాస్) & OTET పాస్ అవ్వాలి. రిజర్వేషన్ కులాల్లీ టెంత్ క్లాస్ చదివినవాళ్ళు కూడా తక్కువ. వాళ్ళు తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా ఇంటి పనులు చూసుకోవడానికి స్కూల్ నుంచి డ్రాపౌట్ అయిపోతారు. అగ్రకులాలవాళ్ళ పిల్లల్ని చదువుకోమని అందరూ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి డ్రాపౌట్ సమస్య రాదు.

ఆడపిల్లని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామనేది కోమటోళ్ళు. ఆ కులంలో ఆడపిల్లలు తక్కువ, చదువుకున్నవాళ్ళు ఎక్కువ. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళలో కోమటోళ్ళు, బాపనోళ్ళు ఎక్కువగా ఉంటారు. చదువురానివాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ గురించి తెలియదు. లిటరసీ రేట్ తక్కువ ఉన్న కులాల్లో ఫీమేల్ సెక్స్ రేషియో ఎక్కువే ఉంటుంది. రిజర్వేషన్ కులాలవాళ్ళు ఆడపిల్లల్ని చిన్న వయసులోనే కూలీ పనులకి పంపిస్తారు. రిజర్వేషన్ కులాల్లో ఆడపిల్లల సంఖ్య ఎక్కువే కానీ చదువుకున్న స్త్రీల సంఖ్య తక్కువ ఉంటుంది. రిజర్వేషన్ వల్ల కులాల జీవన ప్రమాణాలు మారవు అనేది నిజం.


Comments

Popular posts from this blog

సరెండర్ అయితే తాను వలచింది రంభా, తాను మునిగింది గంగా అన్నట్టు అవుతుంది

మసి పూసి మారేడుకాయ చెయ్యడంలో ఈనాడు పత్రిక దిట్ట