Posts

దళితులు అందరు నాస్తికులు, హేతువాదులు, బౌద్ధులా?

దళితులు అందరు నాస్తికులనో, హేతువాదులనో, బౌద్ధులనో నమ్మేవాళ్ళు ఉన్నారు. అలా నమ్మేవాళ్ళలో కొంత మంది నాస్తికులు, కొంత మంది మత విశ్వాసులు. హిందు మతం కుల వ్యవస్థని, లింగ వివక్షని సమర్థించడానికి పుట్టిందని కొంత మంది చదువుకున్నవాళ్ళకి కూడా తెలియదు. దీన్ని అడ్వాంటెజ్‌గా తీసుకునే కొంత మంది ఈ రోజుల్లో కుల వివక్ష, లింగ వివక్ష లేదని వాదిస్తారు. దళిత రిటైర్డ్ ఐ.పి.ఎస్. ఆఫీసర్ పంతులు సమేతంగా పూజలు చెయ్యడంపై కొంత మంది బహుజనవాదులు ఆశ్చర్యపోతున్నారు, కొంత మంది బహుజనవాద వ్యతిరేకులు వెక్కిరిస్తున్నారు. దళితులందరు నాస్తికులు కానప్పుడు ఇక్కడ ఆశ్చర్యపోవడానికో, వెక్కిరించడానికో ఏముంది? హిందు మతం కుల వ్యవస్థని సమర్థించడానికి పుట్టిందని తెలియక మా ఊరిలోనే ఆదివాసులు దసరా జాతర నిర్వహిస్తున్నారు. దీపావళి నాడు మా ఊరిలో పెద్ద సౌండ్‌తో పాటలు పెట్టేది దళితవీధి వాసులు. రావణుడు తమ తాత అని చెప్పి రావణ దహణాన్ని అడ్డుకుంటాం అనే బహుజనవాదులు దీని గురించి ఏమి చెపుతారు? మా ఊరిలో రెండు వీధులు ఉన్నాయి. ఒకటి ఆదివాసి వీధి, ఒకటి దళిత వీధి. దళితుల కంటే ఆదివాసులకి వ్యవసాయ భూమి ఎక్కువ. ఇక్కడ కొంత మంది ఆదివాసులు దళితుల ఇంటిలో భోజనం చెయ...

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో బాక్సైట్ మైనింగ్ గురించి

Image
<

ప్రభుత్వ ఉద్యోగి మంచివాడా కాదా అనేదానితో ప్రభుత్వాన్ని కూల్చేవాళ్ళకి సంబంధం ఉంటుందా?

Image
 పోలీస్ ఆఫీసర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి. పోలీస్ ఆఫీసర్‌కి మార్క్సిజం తెలిసినంతమాత్రాన అతను కమ్యూనిస్ట్ కన్స్పిరేటర్స్‌ని వదిలిపెట్టలేడు. ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీపరుడా, కాదా అనేది కమ్యూనిస్ట్ కన్స్పిరేటర్స్‌కి సంబంధం లేని విషయం. కొంత మంది ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు "ఉమేశ్‌చంద్ర నిజాయితీపరుడైన ఆఫీసర్ అనీ, నక్సల్స్ అతన్ని అన్యాయంగా చంపారనీ". అతనేమీ అంత నిజాయితీపరుడు కాదు. అతను కరీమ్నగర్ ఎస్.పి.గా ఉన్నప్పుడు చాలా మంది సస్పెండెడ్ కానిస్టెబుళ్ళపై సస్పెన్షన్ ఎత్తివేసాడు. నక్సల్స్ చేసేది శ్రమిక వర్గ పోరాటం. పోలీస్ ఆఫీసర్ చేత నిజాయితీగా పని చెయ్యించడం నక్సల్స్ పని కాదు. ఒక ఆఫీసర్ దొరికిపోయిన నక్సల్‌ని కోర్టులో హాజరుపరచకుండా ఎక్స్‌ట్రా జుడిషియల్ కిల్లింగ్‌లో చంపితే అలా ఎందుకు చంపావు అని ఆ ఆఫీసర్‌ని అడిగే హక్కు నక్సల్స్‌కి ఉంటుంది. రాచరికంలో కంటే రిపబ్లిక్‌లో ఎక్కువ స్వేచ్ఛ ఉన్నప్పుడు రాజు మంచివాడైనంతమాత్రాన, అతను చెరువులు & సత్రాలు కట్టినంతమాత్రాన రిపబ్లికన్లు రాచరికాన్ని కూల్చకుండా వదిలేస్తారా? పెట్టుబడిదారీ వ్యవస్థలో కంటే కమ్యూనిజంలో స్వేచ్ఛ ఎక్కువ అని నమ్మేవాడు పెట్టుబడిదారీ చట...

అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు చెప్పే టాక్స్ లెక్కలు మేడి పండు, పొట్ట విప్పితే పురుగులు

Image

కుల నిర్మూలనకి మార్గం అది కాదు

 కులం పోవాలంటే హిందు మతం పూర్తిగా పోవాలి. బాపనోళ్ళు రాసిన పురాణాల్లోని విలన్లని హీరోలుగా ఊహించుకోవడం వల్ల కులం పోదు. పురాణాలు అన్నీ కల్పితాలు. రాముడు పుట్టాడని బాపనోడు నిరూపించలేడు. రావణుడు పుట్టాడని దళితుడు నిరూపించలేడు. నిరూపించగలిగే దాన్ని ఎవరూ పురాణం అనరు. నిరూపణతో సంబంధం లేకుండా నమ్మే దాన్నే పురాణం అంటారు. దసరా నాడు రావణ దహనం చేసేవాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ ఎంత తక్కువ ఉంటుందో, రావణ దహనాన్ని అడ్డుకుంటామనేవాళ్ళకి కూడా సైంటిఫిక్ టెంపర్ అంతే తక్కువ ఉంటుంది, రామ దహనం చేసేవాళ్ళ సైంటిఫిక్ టెంపర్ కూడా అంతే తక్కువ ఉంటుంది. ఎం.ఆర్.పి.ఎస్.వాళ్ళు రావణ దహనం మీద కోర్టులో కేస్ వేస్తామంటున్నారు. రాముడు, రావణుడు పుట్టారని ఎవరూ నిరూపించలేరు. నిరూపించలేని వాటి ఆధారంగా కోర్ట్ ఎలా తీర్పు చెపుతుంది? దళితులు రావణుడు, శంభూకుడు తమకి మూల పురుషులు అని చెప్పుకుంటున్నారు. సూర్యవంశ క్షత్రియులు సూర్యుడు తమకి మూల పురుషుడని చెప్పుకుంటారు, భరద్వాజ గోత్రస్థులు భరద్వాజ మహర్షి తమ మూల పురుషుడని చెప్పుకుంటారు. ఈ కథలన్నీ నమ్మశక్యమేనా అనే సందేహం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళకి తప్పకుండా వస్తుంది.

పోలీస్ సంస్కరణ అమలు చెయ్యడానికి ఇంత ఆలస్యం ఎందుకు?

Image
 

ఎరవాడ జైలులో కసబ్‌కి ఎన్నడూ బిర్యానీ మేపలేదు

Image
 ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కి ఎరవాడ జైలులో ఎన్నడూ బిర్యానీ మేపలేదు. అప్పట్లో అధికారంలో ఉండిన కాంగ్రెస్‌ని ఇరకాటంలో పెట్టడానికి బి.జె.పి. ఇప్పుడు కూడా కసబ్‌కి బిర్యానీలు మేపారనే ప్రచారం చేస్తోంది. కసబ్‌కి బిర్యానీలు మేపలేదు అనడానికి సాక్షి ఐ.పి.ఎస్. ఆఫీసర్ మీరన్ బోర్వంకర్. ఆవిడ తన పుస్తకం "కమిషనర్ మేడం"లో కసబ్‌కి ఒక్కసారి కూడా బిర్యానీ పెట్టలేదని రాసారు. జైల్ అధికారులు, జైల్ బయటి అధికారులు తప్పుడు ప్రచారం చేసారని కూడా రాసారు. తాను ఆ టైమ్‌లో అనేక మంది ఆఫీసర్ల ఫోన్లు లాక్కున్నానని కూడా రాసారు. జైల్‌లో కైదీలకు బిర్యానీలు మేపుతారు అని తప్పుడు ప్రచారం చెయ్యడం వల్ల ఏమి జరిగింది? బూటకపు ఎంకౌంటర్లని సమర్థించేవాళ్ళ సంఖ్య పెరిగింది. వీళ్ళని జైల్‌లో పెడితే వీళ్ళకి బిర్యానీలు మేపుతారు కనుక వీళ్ళని ఎంకౌంటర్‌లో చంపెయ్యడం బెటర్ అనేవాళ్ళు తయారయ్యారు. ఈ లింక్ చదవండి: http://montecristo.freedomlover.net.in/2022/12/blog-post.html