Posts

Showing posts with the label State

ప్రభుత్వ ఉద్యోగి మంచివాడా కాదా అనేదానితో ప్రభుత్వాన్ని కూల్చేవాళ్ళకి సంబంధం ఉంటుందా?

Image
 పోలీస్ ఆఫీసర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి. పోలీస్ ఆఫీసర్‌కి మార్క్సిజం తెలిసినంతమాత్రాన అతను కమ్యూనిస్ట్ కన్స్పిరేటర్స్‌ని వదిలిపెట్టలేడు. ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీపరుడా, కాదా అనేది కమ్యూనిస్ట్ కన్స్పిరేటర్స్‌కి సంబంధం లేని విషయం. కొంత మంది ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు "ఉమేశ్‌చంద్ర నిజాయితీపరుడైన ఆఫీసర్ అనీ, నక్సల్స్ అతన్ని అన్యాయంగా చంపారనీ". అతనేమీ అంత నిజాయితీపరుడు కాదు. అతను కరీమ్నగర్ ఎస్.పి.గా ఉన్నప్పుడు చాలా మంది సస్పెండెడ్ కానిస్టెబుళ్ళపై సస్పెన్షన్ ఎత్తివేసాడు. నక్సల్స్ చేసేది శ్రమిక వర్గ పోరాటం. పోలీస్ ఆఫీసర్ చేత నిజాయితీగా పని చెయ్యించడం నక్సల్స్ పని కాదు. ఒక ఆఫీసర్ దొరికిపోయిన నక్సల్‌ని కోర్టులో హాజరుపరచకుండా ఎక్స్‌ట్రా జుడిషియల్ కిల్లింగ్‌లో చంపితే అలా ఎందుకు చంపావు అని ఆ ఆఫీసర్‌ని అడిగే హక్కు నక్సల్స్‌కి ఉంటుంది. రాచరికంలో కంటే రిపబ్లిక్‌లో ఎక్కువ స్వేచ్ఛ ఉన్నప్పుడు రాజు మంచివాడైనంతమాత్రాన, అతను చెరువులు & సత్రాలు కట్టినంతమాత్రాన రిపబ్లికన్లు రాచరికాన్ని కూల్చకుండా వదిలేస్తారా? పెట్టుబడిదారీ వ్యవస్థలో కంటే కమ్యూనిజంలో స్వేచ్ఛ ఎక్కువ అని నమ్మేవాడు పెట్టుబడిదారీ చట...

పోలీస్ సంస్కరణ అమలు చెయ్యడానికి ఇంత ఆలస్యం ఎందుకు?

Image
 

ఇందిరా గాంధీ వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోవడం BJP అభిమానులకి అవసరమా?

 మన వ్యక్తిగత శత్రువులు ఎవరితోనో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారనుకుందాం. "వాళ్ళు ఎలా పోతే మనకెందుకు?" అనుకుంటాం. మరి మన రాజకీయ శత్రువుకి ఎవరితోనో అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రచారం చెయ్యొచ్చా? సంజయ్ గాంధీ ఫిరోజ్ గాంధీకే పుట్టాడు. అతను పుట్టిన 14 ఏళ్ళ తరువాత అతని తల్లితండ్రులు విడిపోయారు, తరువాత అతని తండ్రి చనిపోయాడు. ఇందిరా గాంధీ ఒక ఆర్మీ ఆఫీసర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని సంజయ్ గాంధీని కనిందని వెబ్‌సైట్లలో ప్రచారం చేస్తున్నవాళ్ళ మీద నెహ్రు కుటుంబ సభ్యులు పరువు నష్టం కేస్ వెయ్యలేదు కానీ మోదీ అనే ఇంటి పేరుని రాహుల్ గాంధీ కించపరిచాడని BJP ప్రభుత్వం అతనికి రెండేళ్ళు జైలు శిక్ష వెయ్యించింది. మనం వేరే వాళ్ళ గురించి ఎంత చెత్త ప్రోపగాండా అయినా చెయ్యగలిగినప్పుడు వాళ్ళు మన ఇంటి పేరుని ఉచ్చరిస్తే మాత్రం సహించలేమా? దున్నపోతు ఈనింది అని ఒకడంటే ఇంకొకడు దూడని కట్టెయ్యమన్నాడు. సంజయ్ గాంధీ పుట్టిన పద్నాలుగేళ్ళ తరువాత అతని తల్లితండ్రులు విడిపోయారు. అతని తల్లి మొగుణ్ణి వదిలేసి ఒక ఆర్మీ ఆఫీసర్‌కి అతన్ని కనిందని ఎవరో రాస్తే మిగితావాళ్ళు అన్‌క్రిటికల్‌గా నమ్మేసారు. మన శత్రువులు అక్రమ సంబంధాలు పెట్టుకుం...

ప్రభుత్వ ఉద్యోగులది ఏ వర్గం?

 పోలీస్ స్టేషన్లు, కోర్టులు లేకపోతే ప్రభుత్వం కొన్ని రోజులు కూడా బతకదు. అయినా పోలీస్ కానిస్టేబుల్ జీతం సీనియారిటీని బట్టి ఇరవై వేలు నుంచి నలభై వేలు మాత్రమే, కోర్టు గుమాస్తా జీతం పదిహేను వేలు నుంచి ముప్పై వేలు మాత్రమే. విచిత్రం ఏమిటంటే నలభై వేల నుంచి ఎనభై వేలు జీతం తీసుకునే టీచర్లు సమ్మె చేస్తారు తప్ప కానిస్టేబుళ్ళు, కోర్టు గుమాస్తాలు సమ్మె చెయ్యరు.  పారిశ్రామిక కార్మికులు సమ్మె చేస్తే ఈ కానిస్టేబుళ్ళ చేతే లాఠీలతో కొట్టిస్తారు. జీతం బాకీలు ఎగ్గొట్టిన మేనేజర్‌కి కార్మికులు గట్టిగా అడిగితే మేనేజర్ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాడు, అప్పుడు ఈ కానిస్టేబుళ్ళే వచ్చి అరెస్ట్ చేస్తారు. నాకు జైలులోని పక్క సెల్‌లో ఒక లారీ డ్రైవర్ పరిచయమయ్యాడు. అతను బాల్కొ అలుమినియం ఫాక్టరీలో డ్రైవర్ పని చేసాడు. అతని మేనేజర్ అతనికి పదమూడు వేలు జీతం ఇస్తామని చెప్పి పదకొండు వేలే ఇచ్చాడు. ఆ మేనేజర్ తొమ్మిది మంది కార్మికుల్ని ఇలాగే మోసం చేసాడు. గట్టిగా అడిగినందుకు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపాడు. వాళ్ళలో కొందరికి బెయిల్ వచ్చింది, కొందరికి బెయిల్ రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం ఈ సమస్య ఉండదు. వ...