Posts

Showing posts with the label జైలు

జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారా?

Image
జైలులో కైదీలకి బిర్యానీలు పెడతారు అనేది బూటకపు ఎంకౌంటర్లని సమర్థించేవాళ్ళ ప్రోపగాండా. నేను ఐదు రోజులు జైలులో ఉన్నాను. జైలు కేంటీన్ క్రాంక్టర్ రూపాయి బియ్యాన్ని బ్లాక్‌లో కొనేసి దాన్ని వండి కైదీలకి పెడతాడని ఒక్క రోజు జైల్ ఫుడ్ తిన్నా అర్థమైపోతుంది. జైలులో పప్పు తినడం చాలా కష్టం. మనం ఇంట్లో చేపలు ఉల్లిపాయల మధ్య ఉడకబెట్టి వండుతాము. జైలు కేంటీన్ కాంట్రాక్టర్ చేపల్ని నూనెలో ముంచి వేపుతాడు, వేస్ట్ నూనెని పప్పులో కలిపేస్తాడు. జైళ్ళ శాఖ ఐ.జి. తక్కువ బిల్ కోట్ చేసినవాడికి కేంటీన్ కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ కాంట్రాక్టర్ ఖర్చు తగ్గించుకోవడానికి చీప్ క్వాలిటీ ఫుడ్ వండుతాడు. వారానికి ఒకసారి మాంసం, చేపలు తినడానికి ఎవడూ జైలుకి వెళ్ళాలనుకోడు. బయట చేపలు వేపిన నూనె పప్పులో కలిపితే రిక్షావాడు కూడా తినడు. రిక్షావాడు కూడా తినలేని ఫుడ్ జైలులో దొరుకుతుంది. నేరాలు తగ్గాలంటే చట్టం ముందు సమానత్వం కూడా ముఖ్యం. చిరంజీవి కొడుకు రేప్ చేసినా, రిక్షావాడి కొడుకు రేప్ చేసినా పోలీసులు వెంటనే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే రేప్‌లు తప్పకుండా తగ్గుతాయి.   నేను ఉండినది ఒడిశా జైలులో. ఒడిశాలో బాపనోళ్ళు కూడా మాంసం తింటారు. జైనులు...

మన సమాజాన్ని 1815 నాటి రాచరిక భూస్వామ్య వ్యవస్థకి దిగజారుద్దామా?

రేపిస్టులని ఎంకౌంటర్ చెయ్యాలని సోషల్ మీడియాలో ప్రతివాడు అరుస్తాడు. జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారని కూడా వీళ్ళు ఏడుస్తారు. జైలులో కైదీలకి బిర్యానీలు మేపేంత బడ్జెట్ జైళ్ళ శాఖ ఐ.జి.కి ఉండదు అని వీళ్ళకి తెలియదు.   ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో నవలలో ప్రాసిక్యూటర్ ఒక రాజభక్తుడు కానీ అతని తండ్రి రాజద్రోహి నెపోలియన్‌తో సంబంధం పెట్టుకుంటాడు. ఆ రహస్యం బయటపడకూడదని ప్రాసిక్యూటర్ హీరోని విచారణ లేకుండానే శాతో దీఫ్ అనే చీకటి చెరసాలలో కైదు చేస్తాడు. 1815లో ప్రపంచంలోని ఏ దేశంలోనూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదు. అప్పట్లో ప్రాసిక్యూటర్‌కి ఇలాంటి తప్పులు చెయ్యడం సాధ్యమే. రేపిస్టులని విచారణ లేకుండా ఎంకౌంటర్ చేసి మన సమాజాన్ని 1815 నాటి రాచరిక భూస్వామ్య వ్యవస్థకి దిగజారుద్దామా?  ఇండియాలో అదే పరిస్థితి వస్తే ఏమవుతుంది? పిచ్చిదాయి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వదనుకుని ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు పిచ్చిదాన్ని రేప్ చేసాడనుకుందాం. ఆ రేప్‌ని చూసినవాణ్ణి ఆ పోలీస్ ఆఫీసర్ బూటకపు ఎంకౌంటర్లో చంపడని గ్యారంటీ ఏమిటి? ఒక పోలీస్ ఆఫీసర్ తమ్ముడు నక్సల్ లీడర్. ఆ ఆఫీసర్ తన తమ్ముణ్ణి సరెండర్ చెయ్యించలేకపోయాడు. ఈ రహస్యం తెలిస...