Posts

Showing posts with the label అత్యాచారం

జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారా?

Image
జైలులో కైదీలకి బిర్యానీలు పెడతారు అనేది బూటకపు ఎంకౌంటర్లని సమర్థించేవాళ్ళ ప్రోపగాండా. నేను ఐదు రోజులు జైలులో ఉన్నాను. జైలు కేంటీన్ క్రాంక్టర్ రూపాయి బియ్యాన్ని బ్లాక్‌లో కొనేసి దాన్ని వండి కైదీలకి పెడతాడని ఒక్క రోజు జైల్ ఫుడ్ తిన్నా అర్థమైపోతుంది. జైలులో పప్పు తినడం చాలా కష్టం. మనం ఇంట్లో చేపలు ఉల్లిపాయల మధ్య ఉడకబెట్టి వండుతాము. జైలు కేంటీన్ కాంట్రాక్టర్ చేపల్ని నూనెలో ముంచి వేపుతాడు, వేస్ట్ నూనెని పప్పులో కలిపేస్తాడు. జైళ్ళ శాఖ ఐ.జి. తక్కువ బిల్ కోట్ చేసినవాడికి కేంటీన్ కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ కాంట్రాక్టర్ ఖర్చు తగ్గించుకోవడానికి చీప్ క్వాలిటీ ఫుడ్ వండుతాడు. వారానికి ఒకసారి మాంసం, చేపలు తినడానికి ఎవడూ జైలుకి వెళ్ళాలనుకోడు. బయట చేపలు వేపిన నూనె పప్పులో కలిపితే రిక్షావాడు కూడా తినడు. రిక్షావాడు కూడా తినలేని ఫుడ్ జైలులో దొరుకుతుంది. నేరాలు తగ్గాలంటే చట్టం ముందు సమానత్వం కూడా ముఖ్యం. చిరంజీవి కొడుకు రేప్ చేసినా, రిక్షావాడి కొడుకు రేప్ చేసినా పోలీసులు వెంటనే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే రేప్‌లు తప్పకుండా తగ్గుతాయి.   నేను ఉండినది ఒడిశా జైలులో. ఒడిశాలో బాపనోళ్ళు కూడా మాంసం తింటారు. జైనులు...

పాక్సొ (మైనర్‌తో సెక్స్) కేసులు ఎందుకు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి?

పాక్సొ కేసు నిందితుల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు. నాకు జైలులో పరిచయమైన పాక్సొ కేసు నిందితుల్లో కొందరు తాము అమ్మాయిని తీసుకెళ్ళాం కానీ రేప్ చెయ్యలేదు అంటున్నారు, కొందరు అమ్మాయి వయసు ఎంతో తెలుసుకోకుండా ఆ పని చేసినవాళ్ళు. బాల్య వివాహం కోసం అమ్మాయిని తీసుకెళ్తే కిడ్నాప్ కేస్ మాత్రమే ఋజువు అవుతుంది, పాక్సో కేస్ ఋజువు అవ్వదు. ఎవడైనా తాను అమ్మాయి వయసు ఎంతో తెలుసుకోకుండా ఆ పని చేసానని చెపితే కోర్ట్ నమ్మదు. అతను కోర్ట్‌లో తాను ఆ పని చెయ్యలేదని చెపుతాడు. పాక్సో కేసు ఋజువైతే మినిమం మూడేళ్ళు కారాగార శిక్ష పడుతుంది. గుప్త రోగం అంటిస్తే మాక్సిమం జీవిత కారాగార శిక్ష పడుతుంది. గర్భం మొయ్యలేని వికలాంగురాలికి కడుపు చేసినా జీవిత కారాగార శిక్ష పడుతుంది. గుప్త రోగం అంటించకపోయినా లాయర్ పాక్సో కేస్ నిందితుడికి అరవైడబ్బై  వేలు ఫీ అడుగుతాడు, వికలాంగురాలికి కడుపు చెయ్యకపోయినా లాయర్ అంతే ఫీ అడుగుతాడు. పేదవాడు అంత ఫీ కట్టలేడు, లాయర్ ఫీ ఇవ్వకపోతే వాదించడు. నిందితుడి తరపున వాదించడానికి ఏ లాయర్ ముందుకి రాకపోతే నిందితుడి స్టేట్మెంట్ రెకార్డ్ చేసి కేస్ విచారిస్తారు. అయినప్పటికీ లాయర్‌ని పెట్టుకోవడానికి కోర్ట్ నిందితు...

మన సమాజాన్ని 1815 నాటి రాచరిక భూస్వామ్య వ్యవస్థకి దిగజారుద్దామా?

రేపిస్టులని ఎంకౌంటర్ చెయ్యాలని సోషల్ మీడియాలో ప్రతివాడు అరుస్తాడు. జైలులో కైదీలకి బిర్యానీలు మేపుతారని కూడా వీళ్ళు ఏడుస్తారు. జైలులో కైదీలకి బిర్యానీలు మేపేంత బడ్జెట్ జైళ్ళ శాఖ ఐ.జి.కి ఉండదు అని వీళ్ళకి తెలియదు.   ద కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో నవలలో ప్రాసిక్యూటర్ ఒక రాజభక్తుడు కానీ అతని తండ్రి రాజద్రోహి నెపోలియన్‌తో సంబంధం పెట్టుకుంటాడు. ఆ రహస్యం బయటపడకూడదని ప్రాసిక్యూటర్ హీరోని విచారణ లేకుండానే శాతో దీఫ్ అనే చీకటి చెరసాలలో కైదు చేస్తాడు. 1815లో ప్రపంచంలోని ఏ దేశంలోనూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదు. అప్పట్లో ప్రాసిక్యూటర్‌కి ఇలాంటి తప్పులు చెయ్యడం సాధ్యమే. రేపిస్టులని విచారణ లేకుండా ఎంకౌంటర్ చేసి మన సమాజాన్ని 1815 నాటి రాచరిక భూస్వామ్య వ్యవస్థకి దిగజారుద్దామా?  ఇండియాలో అదే పరిస్థితి వస్తే ఏమవుతుంది? పిచ్చిదాయి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వదనుకుని ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు పిచ్చిదాన్ని రేప్ చేసాడనుకుందాం. ఆ రేప్‌ని చూసినవాణ్ణి ఆ పోలీస్ ఆఫీసర్ బూటకపు ఎంకౌంటర్లో చంపడని గ్యారంటీ ఏమిటి? ఒక పోలీస్ ఆఫీసర్ తమ్ముడు నక్సల్ లీడర్. ఆ ఆఫీసర్ తన తమ్ముణ్ణి సరెండర్ చెయ్యించలేకపోయాడు. ఈ రహస్యం తెలిస...